Mohanlal's Barroz 3D OTT News : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. మాలీవుడ్ లో స్టార్ హీరో అయిన ఆయన 'దృశ్యం' లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే తెలుగులో 'జనతా గ్యారేజ్' అనే సినిమాలో నటించి, ఇక్కడి ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటిదాకా 400 కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఫస్ట్ టైం 'బరోజ్ 3డీ' అనే సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి.
'బరోజ్' ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్
మోహన్ లాల్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా 'బరోజ్'. ఈ మూవీలో మాయారావు వెస్ట్, తుహిన్ మీనన్, ఇగ్నోసియో మతయోస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా 'బరోజ్' సినిమాను తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ తోనే ఫాంటసీ థ్రిల్లర్ అనే ఫీలింగ్ తెప్పించిన ఈ సినిమాకు ఫస్ట్ షో తోనే నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఓటీటీ మూవీ లవర్స్.
సాధారణంగా హాలీవుడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమాలు అనగానే గుర్తొచ్చే ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్. ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ అదే టైప్ లో రూపొందిన 'బరోజ్' మూవీ కూడా హాట్ స్టార్ లోనే రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి హాట్ స్టార్ మంచి ఫ్యాన్సీ ధరను చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే... సంక్రాంతికి లేదంటే ఫిబ్రవరిలో హాట్ స్టార్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. 'బరోజ్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
'బరోజ్' స్టోరీ ఏంటంటే...
డ గామా అనే ఒక పోర్చుగీసు రాజు ఉంటాడు. అతనికి నమ్మిన బంటు బరోజ్. ఈ రాజు తమ సామ్రాజ్యాన్ని గోవాలో కూడా విస్తరిస్తాడు. అయితే 400 ఏళ్ల నుంచి గోవాలో ఉన్న ఈ రాజవంశ నిధిని కాపాడతాడు బరోజ్. డ గామా రాజు వారసులకు ఆ నిధిని అప్పగించడం ఆయన బాధ్యత. ఇలాంటి తారుణంలోనే ఎవ్వరికి కనిపించని బరోజ్ ఆ రాజవంశంలో 13వ తరం అమ్మాయి ఇసాబెల్లా గోవా రాగా, ఆమెకు మాత్రమే కనిపిస్తాడు. మరోవైపు దుష్ట శక్తులు ఆ నిధిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మరి బరోజ్ ఆమెకు ఆ నిధిని భద్రంగా అప్పగించాడా? ఈ క్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఆ అమ్మాయికి మాత్రమే ఎందుకు బరోజ్ కనిపిస్తున్నాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.