Google Chrome New Feature: గూగుల్ త్వరలో తన సెర్చ్ ఇంజిన్‌లో ఏఐ మోడ్‌ను ప్రవేశపెట్టవచ్చు. వినియోగదారులు ఏదైనా సెర్చ్ చేయడానికి దానిపై ట్యాప్ చేసిన వెంటనే అది వారిని గూగుల్ జెమినై ఏఐ వంటి కొత్త ఇంటర్‌ఫేస్‌కి తీసుకెళుతుంది. నివేదికల ప్రకారం గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పైన ఉన్న లింక్ ఆప్షన్‌లో ఏఐ మోడ్‌ను చేర్చుతుంది. ప్రస్తుతం ఫొటోలు, వీడియోలు వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడ్ వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్ వినియోగదారులకు మరింత అందుబాటులోకి వస్తుంది. వినియోగదారులు తమకు కావాల్సిన ఫాలో అప్ క్వశ్చన్లను కూడా అడగగలరు.


అందుబాటులో స్పీచ్ ఆప్షన్
ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం ప్రకారం గూగుల్ ఇందులో స్పీచ్ ఆప్షన్ కూడా అందించవచ్చని తెలుస్తోంది. అంటే వినియోగదారులు ఏదైనా టైప్ చేయకుండా మాటల ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. అయితే ఇప్పటి వరకు ఇటువంటి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి గూగుల్ నుంచి ఎటువంటి అధికారిక కామెంట్ రాలేదు. 



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


గూగుల్ కొంతకాలం క్రితం ఏఐని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సెర్చ్‌లోనే ఏఐ సమ్మరీని అందించడం ప్రారంభించింది. కొంతకాలంగా ఓపెన్ఏఐ ఛాట్‌జీపీటీ నుంచి గూగుల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఓపెన్ఏఐ అక్టోబర్‌లో ఛాట్‌జీపీటీ సెర్చ్‌ను ప్రారంభించింది. చాలా మంది అనలిస్టులు దీని ప్రజాదరణ వేగంగా పెరుగుతోందని అన్నారు. ఇది గూగుల్‌కు ఆందోళన కలిగించే అంశం.


ఛాట్‌జీపీటీకి ఎక్కువ మంది యూజర్లు
థర్డ్ పార్టీ రీసెర్చర్లు తెలుపుతున్న దాని ప్రకారం ఛాట్‌జీపీటీ ట్రాఫిక్ 3.7 బిలియన్లు కాగా, గూగుల్ క్రోమ్‌కు 3.45 బిలియన్ యూజర్లు ఉన్నారు. దీని నుంచి ఛాట్‌జీపీటీ ప్రజాదరణను బట్టి ఇది గూగుల్‌కి ఇస్తున్న పోటీని అంచనా వేయవచ్చు. దీని తర్వాత గూగుల్‌కి పోటీగా ఓపెన్ ఏఐ... ఏఐ ఆధారిత బ్రౌజర్‌ను తయారు చేస్తోందని ఊహాగానాలు మొదలయ్యాయి.


దీనిపై గూగుల్ కంపెనీని ప్రశ్నించగా వారు స్పందించడానికి తిరస్కరించారు. ప్రస్తుతం కంపెనీ 2025 నాటికి ఛాట్‌జీపీటీ తన యూజర్లను ఒక బిలియన్ వినియోగదారులను చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!