Government Banned 18 OTT Apps: అశ్లీల కంటెంట్, అసభ్యకరమైన వీడియోలను తీసుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం 2024లో పెద్ద చర్య తీసుకుంది. అలాంటి 18 ఓటీటీ యాప్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం అసభ్యకరమైన కంటెంట్‌ను అందించే యాప్‌లపై ప్రభుత్వం చర్య తీసుకుంది. దీంతో పాటు భారతీయ వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి అనేక యాప్‌లను బ్లాక్ చేయాలని కూడా నిర్ణయించింది.
ఐటి రూల్స్ 2021 ప్రకారం 18 ఓటీటీ యాప్‌లను బ్లాక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలిపారు. ఈ యాప్‌లన్నింటి ద్వారా అశ్లీల కంటెంట్ అందిస్తున్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్‌లపై నిషేధం విధించారు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
బ్యాన్ అయిన ఓటీటీ యాప్స్ ఇవే...
డ్రీమ్స్ ఫిల్మ్స్ (Dreams Films)
వూవి (Voovi)
యెస్మా (Yessma)
అన్ కట్ అడ్డా (Uncut Adda)
ట్రై ఫ్లిక్స్ (Tri Flicks)
ఎక్స్ ప్రైమ్ (X Prime)
వీఐపీ (VIP)
బేషారమ్స్ (Besharams)
హంటర్స్ (Hunters)
ర్యాబిట్ (Rabbit)
ఎక్స్‌ట్రామూడ్ (Xtramood)
న్యూఫ్లిక్స్ (Nueflix)
మూడ్ఎక్స్ (MoodX)
మోజ్‌ఫ్లిక్స్ (Mojflix)
వీఐపీ హాట్ షాట్స్ (VIP Hot Shots)
ఫ్యూగి (Fugi)
చికూఫ్లిక్స్ (Chikooflix)
ప్రైమ్‌ప్లే (PrimePlay)
కేసు పెట్టిన కేంద్ర ప్రభుత్వం
అశ్లీల కంటెంట్‌ను అందిస్తున్నారనే అభియోగంపై ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం యాప్స్ యజమానులపై ప్రభుత్వం కేసు పెట్టింది. ఇది మాత్రమే కాకుండా వుమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986లోని సెక్షన్ 4 కింద ఈ యాప్‌లను బ్లాక్ చేయాలని కూడా ఆర్డర్ ఇచ్చారు. వీటిలో చాలా యాప్‌లు కోటి కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉన్నాయి. ఈ యాప్‌లు అశ్లీల కంటెంట్ ట్రైలర్‌లు, క్లిప్‌లను ప్రచారం చేయడానికి ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తాయి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?