టోక్యో ఒలింపిక్‌ వీరుడు, భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు. గణతంత్ర దినోత్సవం నాడు పరమ విశిష్ట సేవా పతకం అందుకోబోతున్నాడు. అతడు రాజపుతానా రైఫిల్స్‌లో సుబేదార్‌గా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.


భారత క్రీడాభిమానులు సుదీర్ఘ కాలంగా కలలు కంటున్న స్వప్నాన్ని నీరజ్‌ చోప్రా నిజం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం అందించాడు. దాంతో వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో పతకం తీసుకొచ్చిన ఆటగాడిగా నిలిచాడు. ఇక అభినవ్‌ బింద్రా తర్వాత దేశానికి రెండో స్వర్ణం అందించిందీ నీరజే.






ఇప్పటికే నీరజ్‌కు ఎన్నో సన్మానాలు జరిగాయి. ఎంతో మంది అభినందించారు. ఎన్నో పురస్కారాలు దక్కాయి. తాజాగా గణతంత్ర వేడుకల్లో అతడికి పరమ విశిష్ట సేవా పతకం బహూకరిస్తుండటం గమనార్హం. 73వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సైనికులు, ఇతరులకు 384 పురస్కారాలు అందించనున్నారు. అందులో 12 శౌర్య చక్ర, 3 బార్‌ సేనా పతకాలు, 81 సేనా పతకాలు, 2 వాయుసేన పతకాలు ఉన్నాయి.


నీరజ్‌కు భారత సైన్యమంటే ఎంతో ప్రేమ. అందుకే సైన్యంలో సుబేదార్‌గా సేవలందిస్తున్నాడు. 2016 దక్షిణాసియా క్రీడల్లో జావెలిన్‌ను 82.23 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాడు. 2017 ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 85.23 మీటర్లు విసిరి పసిడి కొల్లగొట్టాడు. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో 86.47 మీటర్ల దూరం విసిరి స్వర్ణం ముద్దాడాడు. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లడానికి ముందు 2021 మార్చిలో 88.06 మీటర్లతో జాతీయ రికార్డు సృష్టించాడు.


Also Read: Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్ 


Also Read: IPL Lucknow Team: ఆ జట్టు పాత పేరునే కొత్త జట్టుకు.. లక్నో టీం పేరు ఫిక్స్!


Also Read: Virat Kohli: కోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు... ఇదేం పని అంటూ ఆగ్రహం...!


Also Read: Gambhir Corona Positive: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ట్వీట్