Hyderabad Man Has Bitten Venomous Snake: మనం చేసే పని నలుగురికి నచ్చకపోయినా సరే కానీ ఎవరి ప్రాణాల మీదకి తెచ్చేది అయి ఉండొద్దని పెద్దలు చెబుతుంటారు. తాగిన మత్తులోగానీ, లేక ఎక్స్‌పర్ట్‌ను అంటూ చేయకూడదని పనుల జోలికి సైతం వెళ్లడం ప్రాణాల మీదకి తెస్తుంది. సరదా కోసం ఓ వ్యక్తి చేసిన పని విషమంగా మారింది. చివరికి ఆసుపత్రిలో చేరి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పాముతో చెలగాటం ఆడిన వ్యక్తి వివరాలిలా ఉన్నాయి..


మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్(30)  కొంతకాలం కిందట హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా గాజులరామారం పరిధిలోని కట్టమైసమ్మబస్తీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. అతడు రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. పాములు పట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఆదివారం సాయంత్రం జనావాసాల్లోకి వచ్చిన ఓ పామును ఆకాష్ పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా పాములో చెలగాటం ఆడాడు. పాముకు ముద్దులు పెడుతూ ఈ తతంగాన్ని సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నాడు.







కొద్దిసేపు పాముతో ఆటల తరువాత విష సర్పాన్ని వదిలిపెట్టేశాడు. కానీ రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పాము కాటు వేయడం వల్ల అతడు అస్వస్థతకు గురయ్యాడని, . పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతడి శరీరం, ఉదరం నుంచి విషాన్ని తొలగించిన వైద్యులు అతడ్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విష సర్పాలతో ఇలాంటి చేష్టలు చేయకూడదని సూచించారు. 


Also Read: Nellore Police: నెల్లూరు పోలీసుల మర్యాదలే వేరబ్బా.. నిజమేనా అని డౌటా..! అయితే ఇది చదవండి


Also Read: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి