Tokyo Olympics 2020 Live Updates: బాక్సింగ్‌లో పతకం ఖాయం చేసుకున్న లవ్లీనా, సెమీస్ చేరిన పీవీ సింధు... పతకం లేకుండా వెనుదిరిగిన ఆర్చర్ దీపిక

Tokyo Olympics 2020 Day 5 Live Updates: జపాన్ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ - 2020 ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఒకే ఒక్క పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ABP Desam Last Updated: 31 Jul 2021 11:03 AM
Tokyo Olympics 2020: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న భారత హాకీ టీమ్

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి జపాన్ జట్టుపై 5-3 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. పూల్ ఏ గ్రూపులో రెండో స్థానంలో నిలిచింది.

సెమీఫైనల్ చేరిన తెలుగు తేజం పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌ క్వార్టర్ ఫైనల్లో సింధు... జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి పై 21-13, 22-20తో విజయం సాధించి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది.  

పతకం లేకుండానే ముగిసిన దీపిక కథ

ఎన్నో ఆశలతో, కచ్ఛితంగా పతకం గెలుస్తుందనుకున్న నంబర్ వన్ భారత ఆర్చరీ క్రీడాకారిణి దీపిక కుమారి తీవ్ర నిరాశతోనే వెనుదిరిగింది. మహిళల వ్యక్తిగత పోటీల్లో దీపిక క్వార్టర్‌ ఫైనల్‌లో కొరియా ఆర్చర్ ఆన్ సేన్ చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. దీంతో ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. 


 

జబీర్ @ 33

పురుషుల 400మీ. హార్డిల్స్ హీట్స్‌లో జబీర్ హీట్-7లో 5వ స్థానంలో నిలిచాడు ఓవరాల్‌గా 33వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 



హాకీలో మహిళల జట్టు విజయం

మహిళల హాకీలో ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. నాలుగో క్వార్టర్లో నవనీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ గెలిచింది. 



నిరాశపరిచిన ద్యుతిచంద్

మహిళల 100మీ. పరుగు హీట్స్‌లో ద్యుతిచంద్ నిరాశపరిచింది. 45వ స్థానంలో నిలవడంతో సెమీఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. 

గోల్ఫ్... వాతావరణం సహచరించక... బ్రేక్

వాతావరణం సహరించకపోవడంతో గోల్ఫ్ ఆటకు విరామం ప్రకటించారు. వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో అనిర్బన్, ఉదయన్ భారత్ నుంచి పోటీలో పాల్గొనాల్సి ఉంది. 

భారత్‌కు రెండో పతకం... బాక్సింగ్‌లో తొలి పతకం

హమ్మయ్య టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం ఖాయమైంది. మహిళల బాక్సింగ్‌లో 69 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా విజయం సాధించింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్ పై విజయం సాధించింది. వరుసగా మూడు బౌట్లలో విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంది 23ఏళ్ల లవ్లీనా.



ప్చ్... తొలి బౌట్‌లోనే ఓటమి

మొదటిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని తొలి మ్యాచ్ ఆడిన భారత బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ ఓడిపోయింది. థాయిలాండ్ క్రీడాకారిణి సీసొండితో జరిగిన మ్యాచ్‌లో సిమ్రన్ 5-0 తేడాతో ఓడింది. 



బ్యాడ్‌లక్ మను బాకర్ 

మహిళల వ్యక్తిగత 25మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్, రాహీ సార్నబోత్ ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 



గుడ్ న్యూస్... క్వార్టర్స్‌కి దీపిక కుమారి

భారత నంబర్‌వన్ ఆర్చర్ దీపిక కుమారి క్వార్టర్స్‌కి దూసుకెళ్లింది.  రష్యా క్రీడాకారిణి పై 6 - 5 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కి దూసుకెళ్లింది. దీపిక తదుపరి మ్యాచ్లో గెలిస్తే పతకం ఖాయమౌతుంది.



టోక్యో నుంచి భారత గోల్ఫర్‌కి పిలుపు

భారత గోల్ఫర్ దీక్షా దగర్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటూ పిలుపు వచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన రెట్రో అర్థంతరంగా తప్పుకోవడంతో దీక్షాకి పిలుపు వచ్చింది. 



ప్రీ క్వార్టర్స్ చేరిన అతానుదాస్

పురుషుల ఆర్చరీలో భారత క్రీడాకారుడు అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జరిగిన ఎలిమినేషన్‌ రౌండ్‌ పోరులో ఆయన చైనీస్‌ తైపీకి చెందిన యూ చెంగ్‌ డెంగ్‌పై 6-4 తేడాతో విజయం సాధించారు. ఆయన తర్వాతి రౌండ్‌లో కొరియా ఆర్చర్‌ జిన్‌హెక్‌పై 6-5 తేడాతో సంచలన విజయం సాధించారు. లండన్‌ ఒలిపింక్స్‌లో జిన్‌ హెక్‌ స్వర్ణపతక విజేత కావడం విశేషం. 



Olympics 2020: పురుషుల హాకీలో మనోళ్లు సూపర్‌... అర్జెంటీనాపై గ్రాండ్‌ విక్టరీ

ఒలింపిక్స్‌లో అర్జెంటీనా జట్టును భారత్ హాకీ టీం ఓడించింది. టోర్నీలో ఫేవరేట్‌గా ఉన్న అర్జెంటీనాపై భారత్‌ విజయం సాధించింది. గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో జయకేతనం ఎగురవేసింది. మ్యాచ్ ముగిసే సరికి ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాయి. అయితే మ్యాచ్ 43వ నిమిషంలో ఇండియన్ ప్లేయర్‌ కుమార్ వరుణ్ తొలి గోల్ చేశాడు. 48నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్ ఈక్వల్ అయింది. 58 నిమిషంలో ప్రసాద్ వివేక్‌ సాగర్‌ ఓ గోల్, 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్ చేసి అద్భుతమైన విక్టరీని భారత్‌కు అందించారు. 


 

Olympics 2020 sindhu match: క్వార్టర్స్‌కు సింధు

సింధు మరో అడుగు ముందు కేసింది. ఈసారి గోల్డ్‌ మెడల్ సాధిస్తానన్న నమ్మకంతో బరిలోకి దిగిన పీవీ సింధు అదే స్పీడ్ కొనసాగిస్తోంది. ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిక్‌ఫెల్డ్‌పై ఈజీ విక్టరీ సాధించింది. 21-15, 21-13తో ఆమెను చిత్తు చేసి... క్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రత్యర్థిగా యమగుచి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. 

పూజా పంచ్ అదిరింది

బాక్సర్ పూజా తన పంచ్‌లతో అదరగొట్టింది. అల్గేరియా క్రీడాకారిణి చాయెబ్ తో జరిగిన పోటీలో పూజా 5-0తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కి దూసుకెళ్లింది.  

ఆర్చర్ ప్రవీణ్ జాదవ్ ఔట్

ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్ జాదవ్ కథ ముగిసింది. ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు బ్రాడీ ఎలిసన్ చేతిలో జాదవ్ ఓడిపోయాడు.  


 

ఆర్చర్ దీపిక ముందంజ

ఆర్చర్ దీపిక ముందంజ వేసింది. మహిళల వ్యక్తిగత విభాగం తొలి రౌండ్లో దీపిక... భూటాన్‌కు చెందిన కర్మపై 6-0 తేడాతో విజయం సాధించింది.



 

ఆర్చరీలో తరుణ్ రాయ్ ఔట్

పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్‌ రాయ్ ఔటయ్యాడు. ప్రిక్వార్టర్స్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన షానీ ఇటే చేతిలో 6-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఒక పాయింటు తేడాతో అతడు వెనుదిరగడం గమనార్హం. 

సెమీఫైనల్లో 6వ స్థానం

లైట్‌వెయిట్ పురుషుల డబుల్స్ స్కల్స్ సెమీస్‌లో భారత రోయర్లు అర్జున్ - అర్వింద్ జోడీ 6వ స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.  

హాకీలో పరాజయం

మహిళల పూల్ - ఎ లో భారత్-గ్రేట్ బ్రిటన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 1-4తేడాతో ఓడిపోయింది.



ప్రిక్వార్టర్స్ చేరిన పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లో చేరింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లో సింధు హాంకాంగ్ క్రీడాకారిణి చెంగ్ పై వరుసగా రెండు సెట్లు గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. 



 

భారత్ చేరుకున్న సుశీలా దేవి

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జూడో ప్లేయర్ సుశీలా దేవి తిరిగి భారత్ చేరుకుంది. 



పిజ్జా తిన్న చాను

రజత పతకం గెలిచిన తర్వాత తనకు పిజ్జా తినాలని ఉందని మీరాబాయి చాను చెప్పింది. స్వదేశానికి చేరుకున్న చాను... కేంద్ర మంత్రి కిరణ్ రిజుజును కలిసింది. ఈ సందర్భంగా రిజుజు... చానుకు ఇష్టమైన పిజ్జా తెప్పించారు. 



నవోమి ఒసాకా ఔట్

సొంతగడ్డపై జరుగుతోన్న ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని బరిలోకి దిగిన నవోమి ఒసాకకు షాక్ తగలింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణిపై రెండు వరుస సెట్లలో ఓడింది.  

క్వార్టర్ ఫైనల్స్ చేరిన బాక్సర్ లవ్లీనా

మహిళల 69 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన లవ్లీనా క్వార్టర్ ఫైనల్స్ చేరింది. జర్మనీ క్రీడాకారిణిపై ఆమె విజయం సాధించి రెండో క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించింది.  



శరత్ కమల్ ఓటమి

పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ 3వ రౌండ్లో భారత ఆటగాడు శరత్ కమల్ ఓటమి పాలయ్యాడు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మ లాంగ్ పై 4-1తేడాతో ఓడిపోయాడు.



చిరాగ్-సాత్విక్ జోడీ విజయం

భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ చిరాగ్-సాత్విక్ జోడీ విజయం సాధించింది. 21-17, 21-19 తేడాతో గ్రేట్  బ్రిటన్ జోడీపై విజయం సాధించారు.  



10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో భారత్‌కు నిరాశ

క్వాలిఫికేషన్‌ స్టేజ్‌-2లో షూటర్లు సౌరభ్‌ చౌదరి, మనుబాకర్‌ నిరాశపరిచారు. 8 టీముల్లో 7వ స్థానంతో ఈ జోడీ సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్‌ స్టేజ్‌-1లో అగ్రస్థానంలో నిలిచిన వీరు.. స్టేజ్‌-2లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో పతక మ్యాచ్‌లకు అర్హత సాధించలేకపోయారు.

స్పెయిన్‌పై 3-0తో అదరగొట్టిన పురుషుల హాకీ జట్టు

ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన భారత పురుషుల హాకీ జట్టు ఈ రోజు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. 3-0 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (14వ నిమిషం), రూపిందర్‌పాల్‌ సింగ్‌ (15ని, 51ని) చక్కని గోల్స్‌తో ఆకట్టుకున్నారు.



Background

Tokyo Olympics 2020: జపాన్ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడలు టోక్యో ఒలింపిక్స్ - 2020 ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఒకే ఒక్క పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మీరాబాయి చాను రజతం గెలిచింది. నాలుగో రోజు(సోమవారం) క్రీడల్లో భారత్‌కు నిరాశ తప్పలేదు. పతకం తెస్తుందనుకున్న టేబుల్ టెన్నిస్ క్రీడకారిణి మనిక బాత్ర 3వ రౌండ్లో ఓడిపోయింది. బాగా ఒత్తిడికి గురవ్వడంతో మ్యాచ్ ఓడిపోయినట్లు మనిక మ్యాచ్ అనంతరం తెలిపింది. 


భారత స్టార్‌ బ్యాడ్మింటన్ డబుల్స్‌ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి జోడీకి చుక్కెదురైంది. అతానుదాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌లతో కూడిన భారత పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్స్‌లో 0-6తో కొరియా చేతిలో చిత్తయింది. టెన్నిస్‌లో సుమిత్‌ నగాల్‌ కూడా ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో నగాల్‌ 2-6, 1-6తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో సానియామీర్జా-అంకిత రైనా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. హాకీలో భారత మహిళల జట్టు   వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. పూల్‌-ఎ పోరులో భారత్‌ 0-2 గోల్స్‌తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత జర్మనీ చేతిలో ఓడింది.


మహిళల ఫెన్సింగ్‌లో భారత్‌ తరఫున భవానీదేవి బరిలో దిగింది. తొలి రౌండ్లో 15-3తో నడియా బెన్‌ (ట్యూనీసియా)పై గెలిచిన భవాని.. రెండో రౌండ్లో 7-15తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ మానొన్‌ బ్రూనెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడింది. స్విమ్మింగ్‌లో సాజన్‌ ప్రకాశ్‌ విఫలమయ్యాడు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో 1 నిమిషం 56:38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సెమీస్‌ చేరలేకపోయాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లైలో అతడు పోటీపడాల్సి ఉంది. స్విమ్మింగ్‌లో ఇప్పటికే మానా, శ్రీహరి ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించారు. తొలి ఒలింపిక్స్‌ ఆడుతున్న ఆసియా రజత పతక విజేత ఆశిష్‌ కుమార్‌ (75 కిలోలు) పోటీల నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ఆశిష్‌ 0-5తో తౌహెటా (చైనా) చేతిలో ఓడాడు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.