Gunasekhar's Euphoria Making Video Released: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Guna Sekhar), టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక (Bhoomika) కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'యుఫోరియా' (Euphoria). గుణశేఖర్ హోమ్ బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై.. నీలిమ గుణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. మహాశివరాత్రి సందర్భంగా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ ట్రెండీ టాపిక్‌పై మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా మూవీ ఉండనుందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. గుణశేఖర్ ఇప్పటివరకూ ఎవ్వరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా 'యుఫోరియా' (Euphoria) మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంతో విఘ్నేశ్ రెడ్డి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. భూమికతో పాటు సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - ఇక వయలెన్స్ తప్పదా..! - 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' సీజన్ 2 వచ్చేస్తోంది..

దాదాపు 20 ఏళ్ల తర్వాత..

దాదాపు 20 ఏళ్ల తర్వాత 'యుఫోరియా' మూవీతో హిట్ కాంబో రిపీట్ అవుతోంది. గతంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'ఒక్కడు' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా నటించగా.. అటు మహేశ్‌తో పాటు ఇటు భూమికకు సైతం టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత పలు సినిమాలు తీసినా గుణశేఖర్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత వచ్చిన రుద్రమదేవి ఓ మోస్తరుగా మెప్పించింది. ఆయన లాస్ట్ మూవీ 'శాకుంతలం' అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నప్పటికీ అవి అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఈ క్రమంలో 'యుఫోరియా' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హిట్ కొట్టాలని గుణశేఖర్ భావిస్తున్నారు.

మరోవైపు.. భూమిక రీ ఎంట్రీ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చివరగా ఆమె అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి 'బటర్ ఫ్లై' మూవీలో నటించారు. అలాగే కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన 'ఎమర్జెన్సీ' మూవీలో కూడా కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉండగా గోవాలో సమర వెల్నెస్ అనే పేరుతో హోటల్‌ను ప్రారంభించి, వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. అటు సినిమాలు.. ఇటు బిజినెస్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా బిజీ బిజీగా ఉన్నారు. 

Also Read: వెరైటీ టైటిల్‌తో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - డాన్‌గా మారిన యువకుడి స్టోరీగా 'కన్నెడా', ఎందులో స్ట్రీమింగ్ అంటే?