Just In





MLC Election Voting Procedure : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
MLC Election 2025: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈవిషయాలు తెలుసుకోకుంటే మీ అభ్యర్థి ఓటమికి మీరే కారణం కావచ్చు

MLC Elections 2025: తెలంగాణలో మూడు ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. నార్మల్‌గా సార్వత్రిక ఎన్నికల్లో వేసే ఓటింగ్‌కు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఓటింగ్‌కు చాలా తేడా ఉంటుంది. ఏ మాత్రం తడబడినా మీ ఓటు చెల్లకుండా పోతుంది. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ ఎన్నికలు జరిగిన ప్రతి సారి ఎక్కువ ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. కొన్ని సార్లు తలపడిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొన్నిసార్లు ఈ ఎన్నికల్లో తప్పులో కాలేస్తుంటారు. అందుకే వారి ఓటు చెల్లకుండా పోతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. గురువారం ఉదయం నుంచి జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్‌లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా ఇవి బ్యాలెట్ పేపర్‌తో ఈ పోలింగ్ జరగనుంది. అందులో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో మీరు ఓటు వేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు అదే టైంలో తర్వాత వాళ్లకి కూడా ఏదో నెంబర్ ఇవ్వాలి. అందుకే ఎక్కువ మంది ఓటును వేసే క్రమంలో కొంత పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల ఓటు చెల్లకుండా పోతుంది.
Also Read: ఏపీ, తెలంగాణలోని ఆ జిల్లాల్లో మద్యం బంద్- ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. చదువుకున్న వాళ్లకు ఓట్లు వేయడం రాదా అనే ఆశ్చర్యకరమైన కామెంట్స్ కూడా వచ్చాయి. ఎమ్మెల్సీ పోలింగ్‌లో పాల్గొనే వాళ్లు ఓటు ఎలా వేయాలో ఓసారి చూద్దాం.
ఉపాధ్యాయ/పట్టభద్రుల (MLC) ఓటు వేయడానికి సూచనలు..
1) ఈ ఎన్నికల్లో ఓటింగ్ మెషిన్‌లు ఉండవు. బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. బ్యాలెట్ పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థుల పేరు, ఫోటోలు ఉంటాయి..
2) ప్రాధాన్యతా క్రమంలో ఓటరు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ నచ్చిన పేరు గుర్తుకు ఎదురుగా "1" నెంబర్ వేయాలి. అది కూడా బూత్‌లో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాల్సి ఉంటుంది..
3) మొదటి ప్రాధాన్యత ఎక్కువ నచ్చిన వారికి 1 ఇచ్చిన తర్వాత మిగతా వాళ్లకు అదే తీరుగా 2,3,4..ఇలా వేయచ్చు. ఇలా బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేయవచ్చు.
4) ఒకరికి కేటాయించిన నెంబర్ వేరే వాళ్లకు ఇవ్వకూడదు. అలా వేస్తే అది చెల్లని ఓటుగా పరిగణిస్తారు.
5) ఒక్కరికే ఓటు వేయవలసిన అవసరం లేదు. ఎందరికైనా వేయచ్చు.
6) వరుస క్రమం తప్పరాదు. అనగా 1 వేయకుండా 2,3,4 వేయరాదు.
7) 1,2,3,4,5 లాంటి సంఖ్యలనే వేయాలి. రోమన్ సంఖ్యలు వాడకూడదు. ఉదాహరణకు I,II,III,IV, V ఇలాంటి సంఖ్యలు వేయకూడదు. ఇంగ్లీష్‌లో ఒన్, టూ, అని రాయకూడదు
8) అంకెలు కాకుండా సున్నాలు చుట్టడం, టిక్కులు(✔️) పెట్టడం లాంటివి చేయకూడదు. ఆ ఓటు చెల్లనిదే అవుతుంది.
9) ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కి వెళ్లే సమయలో ఎన్నికల సంఘం అనుమతించిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి..
10) అంధులు, దివ్యాంగ ఓటలు తమ ఓటును వినియోగించుకునేందుకు కంపార్ట్‌మెంట్ వద్దకు ఎవరైనా ఒక వయోజన సహాయకుడిని తీసుకెళ్లవచ్చు..
11) మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్టానిక్ పరికరాలు పోలింగ్ బూత్‌లోకి వెంట తీసుకెళ్లకండి.. వాటిని అనుమతించరు..
Also Read: ఏపీ, తెలంగాణలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- మార్చి 31 తర్వాత సేవలు ఆగిపోవచ్చు!