Just In





Ration Cards EKYC Update News: ఏపీ, తెలంగాణలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- మార్చి 31 తర్వాత సేవలు ఆగిపోవచ్చు!
Ration Cards EKYC News:మార్చి 31 లోపు రేషన్ కార్డులు ఈకేవైసీ చేయకపోతే సేవలు నిలిచిపోతాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ఒకసారి గడవు పొడిగించిన కేంద్రం ఇప్పుడు రెండోసారి పెంచింది.

Ration Cards EKYC Update News: తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఉన్న వారందరికి బిగ్ అప్‌డేట్ ఇది. మార్చి 31 లోపు మేల్కోకుంటే రేషన్ కార్డు ద్వారా మీకు అందే సేవలు నిలిచిపోవచ్చు. అందుకే మార్చి 31లోపు మీరు EKYC చేయించుకోవాలి.
EKYC తప్పనిసరి
దేశంలో కోట్ల మంది ప్రజలు రేషన్ కార్డు కలిగి ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలు పొందడంలో రేషన్ కార్డు చాలా కీలకం. అందుకే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలు ఈ రేషన్ కార్డు కోసం అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి కీలకమైన రేషన్ కార్డులు అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది.
మార్చి 31 లాస్ట్ గడువు!
EKYC అప్‌డేట్ కోసం ఇప్పటికే అనేక గడువులు ఇచ్చింది కేంద్రం. అక్టోబర్ చివరి నాటికి అంతా EKYC చేసుకోవాలని కార్డుహోల్డర్‌లు అందరికీ సమాచారం ఇచ్చింది. అప్పటికీ కొన్ని పెండింగ్ ఉండిపోయాయి. అందుకే ఆ గడువును మళ్లీ డిసెంబర్ 31 వరకు పెంచారు. ఇంకా పూర్తి కాలేదని గ్రహించిన అధికారులు ఆ గడువును ఇప్పుడు మార్చి 31 వరకు పెంచారు. ఆలోపు కార్డుదారులంతా EKYC చేసుకోవాలని చెబుతున్నారు.
Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
మీ రేషన్ డీలర్ వద్దే EKYC ఇలా చేసుకోండి
దేశవ్యాప్తంగా ఉన్న కార్డులు ఆధార్‌తో అనుసంధానించారు. అయినప్పటికీ ఇంకా తప్పులు దొర్లుతున్నాయి. వందకు వంద శాతం నిజమైన లబ్ధిదారులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకే ఒక్క శాతం తప్పులు కూడాలేకుండా చూసుకునేందుకు E-KYC ప్రక్రియను పకడ్బంధీగా చేపడుతోంది. లబ్ధిదారులు E-KYCని తమ డీలర్ వద్దే చేసుకోవాల్సి ఉంటుంది. 4G e-POS యంత్రాల వద్ద వేలి ముద్రలు, ఆధార్ కార్డు మళ్లీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇంకా అప్‌డేట్ కానీ లక్షల రేషన్ కార్డులు
మొదట్లో సర్వర్ బిజీ కారణంగా ప్రక్రియ సజావుగా సాగలేదని గడువు పెంచారు. ఇప్పుడు ఇంకా అప్‌డేట్ చేయని వాళ్లు ఉన్నందున మరోసారి గడవు పెంచారు. ఈసారి అప్‌డేట్ చేయకుంటే కార్డును బ్లాక్ చేస్తారు. కార్డు ఆధారంగా ప్రజలకు అందజేసే సేవలను వాళ్లకు నిలిపివేస్తారు. ఇంకా చాలా మంది కుటుంబ సభ్యులు చనిపోయినప్పటికీ కార్డుల నుంచి డిలీట్ చేయలేదు. కొత్త వారిని కార్డుల్లో యాడ్ చేయలేదు. మరికొందరు ఇంటి పేరుల్లో మార్పులు చేర్పులు చేయలేదు. ఇలాంటి సమస్యలు నివారించేందుకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడవు ఇచ్చింది.
తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ఇప్పుడు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రయ ప్రారంభంకానుంది. వివిధ రూపాల్లో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో కార్డులు పంపణీ చేపడతారు. తర్వాత మిగతా జిల్లాలో పంపిణీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొత్త కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, వారి ఖాతాల్లో రూ.6 వేలు చొప్పున జమ