MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. గురువారం ఉదయం పోలింగ్ జరగనుంది. చాలా జిల్లాల్లో ఈ ఎన్నికలు ప్రభావితం కావడంతో అన్ని పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ పోటీలో నిలవలేదు. వామపక్ష, స్వతంత్రులతో అక్కడ అధికార పార్టీ పోటీ పడుతోంది.
తెలంగాణలో ఎక్కడెక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు
మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గానికి, వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్స్ స్థానానికి, మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సైతం గురువారం ఎన్నికల జరగనున్నాయి.
తెలంగాణలో ఎవరెవరు పోటీలో ఉన్నారు?
బీజేపీ తరఫున నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నరోత్తం రెడ్డి, కరీంనగర్ - మెదక్ - నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య, పట్టభద్రుల నియోజకవర్గానికి సి. అంజిరెడ్డిని నిలబెట్టింది. కాంగ్రెస్ తరఫున కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి. నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కాంగ్రెస్ ఎవర్నీ నిలబెట్టలేదు. బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడం లేదు.
Also Read: తెలంగాణలో ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరెవరు పోటీ చేస్తున్నారు?
ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా - గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లా నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. కృష్ణా- గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజాను నిలబెట్టారు. వీళ్లిద్దరూ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు.
పోలింగ్ టైమింగ్స్ ఏంటీ?
గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందు ఆ జిల్లాల్లో మద్యం షాపులు మూడు రోజుల పాటు మూసివేశారు. సాయంత్రం నాలుగ గంటలతో ప్రచారం ముగిసింది. రిజల్ట్స్ వచ్చే వరకు స్థానికేతర నాయకులు ఉండొద్దని అధికారులు చెప్పారు.
తెలంగాణలో ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు?
తెలంగాణలో ఎన్నికలు జరిగే మూడు స్థానాల్లో ఎననికల ఎన్నికల అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్‌కు కలిపి 93 కామన్ పోలింగ్ స్టేషన్లు సిద్దం చేశారు. ఇవే కాకుండా గ్రాడ్యుయేట్లకు ప్రత్యేకంగా 406 పోలింగ్ కేంద్రాలు, టీచర్స్ స్పెషల్‌గా 181 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
Also Read: విచారణకు ఆదేశిస్తారా? రాజీనామా చేస్తారా? వీసీల వివాదంపై లోకేష్‌కు వైసీపీ సవాల్
ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే
- నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 3
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - ఫిబ్రవరి 10
- నామినేషన్ల పరిశీలన - ఫిబ్రవరి 11
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - ఫిబ్రవరి 13
- పోలింగ్ ప్రక్రియ - ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ..
- ఓట్ల లెక్కింపు ప్రక్రియ - మార్చి 3