Aadhi Pinisetty Reaction On Divorce Rumours With Nikki Galrani: నటుడు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తన వైవాహిక జీవితంపై వస్తోన్న రూమర్లపై స్పందించారు. నిక్కీ గల్రానీతో (Nikki Galrani) తాను విడిపోతున్నట్లు వస్తోన్న వార్తలపై అసహనం వ్యక్తం చేశారు. 'శబ్దం' సినిమా ప్రమోషన్లలో భాగంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడారు. తాను నిక్కీ గల్రానీతో విడాకులు తీసుకుంటున్నట్లు వస్తోన్న వార్తలను చూసి చాలా బాధ పడ్డానని.. అలాంటి వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిక్కీ నాకు మొదటి నుంచి మంచి స్నేహితురాలు. నా ఇంట్లో వాళ్లు సైతం ఆమెకు బాగా నచ్చారు. అలాగే, నా కుటుంబానికి సైతం ఆమె ఎంతో చేరువైంది. ఆమెతో లైఫ్ నాకు సంతోషంగా ఉంటాననిపించింది. దీంతో పెద్దల అంగీకారంతో మేము వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం జీవితాన్ని సంతోషంగా సాగిస్తున్నాం. అయితే, మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని యూట్యూబ్ కథనాలు వచ్చాయి. ఫస్ట్ వాటిని చూసి నేను షాకయ్యా. చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆయా ఖాతాల్లో ఉన్న పాత వీడియోలు చూసి ఇలాంటివి పట్టించుకోకుండా ఉండడమే మంచిది అనిపించింది. ఇలాంటి వాళ్లు క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారు అనిపించింది.' అని ఆది పేర్కొన్నారు.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఇద్దరూ కలిసి 'యాగవరైనమ్ నా కక్కా' సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో 2015లో మలుపు పేరుతో తెలుగులోనూ వచ్చింది. ఈ సినిమా టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం మరకతమణి మూవీలోని కలిసి నటించారు. దాదాపు రెండేళ్లు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు. అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల విడాకుల రూమర్స్ రాగా దానిపై ఆది పినిశెట్టి క్లారిటీ ఇచ్చారు.
Also Read: 'హిట్ 3'లో నానితో పాటు అడివి శేష్... కృష్ణ దేవ్‌తో అర్జున్ సర్కార్ సందడి - ట్విస్ట్ చూశారా?
డిఫరెంట్ కథలతో..
ఆది పినిశెట్టి అటు తమిళం ఇటు తెలుగులోనూ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా నెగిటివ్ రోల్‌లోనూ నటించి మెప్పించారు. తేజ దర్శకత్వం వహించిన 'ఒక V చిత్రం' మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం చాలా గ్యాప్ తర్వాత 2009లో 'వైశాలి'తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఏకవీర, గుండెల్లో గోదారి, మలుపు, మరకతమణి సినిమాలు ఆకట్టుకున్నాయి. నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ 'సరైనోడు'లో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సుకుమార్ 'రంగస్థలం'లో రామ్ చరణ్ అన్నగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. నీవెవరో, అజ్ఞాతవాసి, యూటర్న్, దివారియర్ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా.. ఆయన లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'శబ్ధం'. అరివళగన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. వైశాలి విజయం తర్వాత వీరి కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ నెల 28న విడుదల కానుంది. 7జి ఫిల్మ్స్ శివ నిర్మించగా.. సిమ్రాన్, లైలా, లక్ష్మీమేనన్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: సరదాగా ఓసారి గడిచిన కాలానికి వెళ్లొద్దామా! - మరోసారి థియేటర్లలోకి బాలయ్య 'ఆదిత్య 369', ఎప్పుడంటే?