ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల కారణంగా ఆ దేశ అథ్లెట్లు టోక్యోలో జరుగుతోన్న పారాలింపిక్స్‌లో పాల్గొనలేకపోయారు. ప్రస్తుతం ఆ దేశ క్రికెట్‌ భవిష్యత్తుపై కూడా అభిమానుల్లో అనుమానాలు చాలా ఉన్నాయి. అయితే, తాజాగా తాలిబన్లు క్రికెట్ గురించి ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేసిన మ్యాచులు ఆడేందుకు ఎలాంటి అంతరాయం కలిగించబోమని తాలిబన్లు స్పష్టం చేశారు.


Also Read: Watch: పొలార్డ్‌కి కోపం వచ్చింది... ఏం చేశాడో చూడండి?


ఈ ఏడాది నవంబరులో అఫ్గానిస్థాన్‌ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ ఆడుతుందని తాలిబన్‌ సాంస్కృతిక కమిషన్‌ డిప్యూటీ హెడ్‌ అహ్మదుల్లా వసీఖ్‌ పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో అన్ని దేశాలతో తాము సత్సంబంధాలు  ఏర్పరుచుకోవాలని అనుకుంటున్నాం. అప్పుడే, అఫ్గాన్‌ ఆటగాళ్లు విదేశాలకు, విదేశీ ఆటగాళ్లు అఫ్గాన్‌కు రాగలుగుతారు’ అని వసీఖ్ తెలిపారు. 


Also Read: T20 World Cup 2021: నేను T20 ప్రపంచకప్‌లో ఆడట్లేదు... ప్రకటించిన బంగ్లా ప్లేయర్ తమీమ్ ఇక్బాల్... ఎందుకంటే?


ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకు వచ్చిందంటే... నవంబరులో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా x అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా వసీఖ్ ప్రకటనతో అనుమానాలన్నీ పటాంపంచలయ్యాయి.


Also Read: T20 World Cup: నాలుగో టెస్టు తర్వాత T20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రకటన... అప్పుడే ఎందుకంటే?


హోబర్ట్‌లో చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి ఆదేశాలు జారీ చేశారు. ‘క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ), అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ) మధ్య సత్సంబంధాలున్నాయి. ఇరు జట్లు కలిసి కచ్చితంగా టెస్టు మ్యాచ్‌ ఆడతాయి. దాని తర్వాత దుబాయిలో జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కూడా అఫ్గాన్‌ జట్టు పాల్గొంటుంది’ అని ఆసీస్ ప్రతినిధి వెల్లడించారు.


Also Read: ICC Test Rankings: కోహ్లీ వెనక్కి... రోహిత్ శర్మ ముందుకు... టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC... నంబర్‌వన్‌గా జో రూట్


మరోవైపు రషీద్‌ ఖాన్‌, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది. 


Also Read: Shahid Afridi Supports Taliban: తాలిబన్లు 'పాజిటివ్ మైండ్'తో ఉన్నారు.. వాళ్లకి క్రికెట్ అంటే ఇష్టం: అఫ్రిదీ


Also Read: AFG vs PAK: క్రికెటర్ల మానసిక పరిస్థితులు బాగోలేదు... పాకిస్థాన్ X అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా