ప్రతిష్టాత్మక T20 ప్రపంచకప్ టోర్నీ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తాను పాల్గొనడం లేదని బంగ్లాదేశ్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ ప్రకటించాడు. బంగ్లా జట్టులో సీనియర్ ప్లేయర్ అయిన ఇక్బాల్ నిర్ణయం పట్ల పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. తన స్థానంలో యువ ఆటగాళ్లకి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్బాల్ తెలిపాడు.
Also Read: T20 World Cup: నాలుగో టెస్టు తర్వాత T20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రకటన... అప్పుడే ఎందుకంటే?
‘బంగ్లాదేశ్ ఆడిన చివరి 15 - 20 మ్యాచ్‌ల్లో నేను ఆడలేదు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్‌ముల్ హాసన్, చీఫ్ సెలక్టర్ మినాజుల్‌తో తాను టీ20 ప్రపంచకప్ ఆడలేనని, అందుబాటులో ఉండలేనని చెప్పాను. ప్రపంచకప్‌లో గేమ్ ప్లాన్ చాలా ముఖ్యం. నేను గత కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో పాటు మోకాలి గాయం కూడా మరో కారణం’ అని ఇక్బాల్ చెప్పాడు.
Also Read: ICC's EAP Qualifiers Cancelled: T20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లు రద్దు... ప్రకటించిన ICC
ఈ ఏడాది ఏప్రిల్ - మేలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇక్బాల్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఆ తర్వాత జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లకు ఎంపిక కాలేదు.
బంగ్లాదేశ్ తరఫున ఇక్బాల్ ఇప్పటి వరకు 78 టీ20లు ఆడాడు. 1758 పరుగులు చేశాడు. టీ20ల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 103 కావడం గమనార్హం. టీ20ల్లో ఒక శతకం, 7 అర్ధ శతకాలు నమోదు చేశాడు.
అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్‌లో జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా యూఏఈ, ఓమన్‌కి వేదిక మారిన సంగతి తెలిసిందే.
Also Read: Ranji Trophy: రంజీ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసిన BCCI... జనవరి 13 నుంచి మ్యాచ్‌లు