క్రికెట్లో దేశవాళీ సీజన్లు ప్రారంభంకాబోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది ఎన్నో మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక నుంచి వాయిదా పడిన లేదా రద్దయ్యిన టోర్నీలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా BCCI రంజీ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది. 


Also Read: Dale Steyn Retirement: అంతర్జాతీయ క్రికెట్‌‌కి డేల్ స్టెయిన్ గుడ్ బై.. అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటన


వచ్చే ఏడాది జనవరి  5 నుంచి మార్చి 20 వరకు రంజీ ట్రోఫీ జరగనుంది. టోర్నీకి ముందు ఆటగాళ్లు 5 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకుని రెండు రోజులు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటారు. జనవరి 13 నుంచి టోర్నమెంట్ ప్రారంభంకానుంది. టోర్నీలో పాల్గొనే జట్లను 6 గ్రూపులుగా విభజించారు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలోని మ్యాచ్‌లన్నీ ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, త్రివేండ్రం, అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. 


Also Read: PKL 2021: UP Yodha టీమ్ స్పాన్సర్‌గా ABP NEWS... జెర్సీ ఆవిష్కరించిన ABP CEO అవినాశ్ పాండే


ఫిబ్రవరి 20 నుంచి నాకౌట్ మ్యాచ్లు, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు క్వార్టర్ ఫైనల్, మార్చి 8 నుంచి 12 వరకు సెమీఫైనల్, మార్చి 16 నుంచి 20 వరకు ఫైనల్ జరగనుంది.   


Also Read: IPL 20221: IPL లో రెండు కొత్త జట్లు... బిడ్లు ఆహ్వానించిన BCCI... వచ్చే ఏడాది నుంచి 10 జట్లు


List of teams for group matches and their match venues 





  • Elite A: Gujarat, Punjab, Himachal Pradesh, Madhya Pradesh, Services and Assam. (Venue- Mumbai)

  • Elite B: Bengal, Vidarbha, Rajasthan, Kerala, Haryana and Tripura. (Venue- Bangalore)

  • Elite C: Karnataka, Delhi, Mumbai, Hyderabad, Maharashtra and Uttarakhand. (Venue- Kolkata)

  • Elite D: Saurashtra, Tamil Nadu, Railways, Jammu and Kashmir, Jharkhand and Goa. (Venue- Ahmedabad)

  • Elite E: Andhra, Uttar Pradesh, Baroda, Odisha, Chhattisgarh and Puducherry. (Venue- Trivandrum)

  • Plate Group: Chandigarh, Meghalaya, Bihar, Nagaland, Manipur, Mizoram, Sikkim and Arunachal Pradesh. (Venue- Chennai)