దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ప్రస్తుత తరంలో స్టెయిన్ అత్యుత్తమ బౌలర్ గా గుర్తింపు పొందాడు. 38 ఏళ్ల వయసులో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.


Also Read: IPL 20221: IPL లో రెండు కొత్త జట్లు... బిడ్లు ఆహ్వానించిన BCCI... వచ్చే ఏడాది నుంచి 10 జట్లు






మొత్తం మ్యాచ్ లు..


స్టెయిన్ మొత్తం 93 టెస్ట్ మ్యాచ్ లు. 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. వీటితో పాటు 95 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు.


తన కెరీర్ లో మొత్తం 439 వికెట్లు పడగొట్టాడు.


అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టెయిన్ 8వ స్థానంలో ఉన్నాడు.


Also Read: PKL 2021: UP Yodha టీమ్ స్పాన్సర్‌గా ABP NEWS... జెర్సీ ఆవిష్కరించిన ABP CEO అవినాశ్ పాండే


స్టెయిన్ రిటైర్మెంట్ పై స్పందనలు: 


 డేల్‌ స్టెయిన్‌ రిటైర్మెంట్‌పై పలువురు క్రికెటర్లు, మాజీలు స్పందించారు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో వందల వికెట్లు తీసిన స్టెయిన్ అరుదైన వ్యక్తి అని ప్రశంసించారు. అతడి బౌలింగ్‌ను గుర్తుచేసుకుంటూ పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు.


* గో వెల్‌ గ్రేట్‌ మ్యాన్‌. నువ్వు బౌలింగ్‌ చేసేటప్పుడు నిప్పులు చెరిగేవాడివి. క్రికెట్‌ చూసిన గొప్ప ఆటగాళ్లలో నువ్వొకడివి -సెహ్వాగ్‌


* స్టెయిన్‌ నీ అత్యద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. నువ్వు సాధించినదానికి గర్వపడొచ్చు. నీ రెండో ఇన్నింగ్స్‌ బాగుండాలని కోరుకుంటున్నా.  -వీవీఎస్‌


* నా ఆల్‌టైమ్ ఫేవరేట్‌ క్రికెటర్ నువ్వు. మీకంతా మంచే జరగాలి.   -హార్దిక్‌ పాండ్య


* ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ కన్నా మేటి బౌలర్‌ లేడు. త్వరలోనే నిన్ను కలుస్తా దిగ్గజం.     -కెవిన్‌ పీటర్సన్‌


* డేల్‌.. నీ కెరీర్‌ ఎంత అద్భుతమైనది. ఎన్నోసార్లు నా ఆఫ్‌ స్టంప్‌ను ఎగరగొట్టినందుకు ధన్యవాదాలు.     -మైఖేల్‌ వాన్‌


* గొప్ప ఆటగాడు. మనసున్న మంచోడు. ఎప్పటికి గుర్తుండే మధుర జ్ఞాపకాలు మిగిల్చావు.    -ఏబీ డివిలియర్స్‌


* అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అది మైదానమైనా, బయటైనా, ఎక్కడైనా... ఒక్కటే.   -మహేలా జయవర్దెనె