తమిళ నటుడు విజయ్ కాంత్ కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. సెకెండ్ వేవ్‌లో కరోనా బారినపడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసంగాలు చేయలేక చేతితో సైగలు చేస్తూ నామమాత్రంగా ప్రచారం నిర్వహించారు. అయితే విజయ్ కాంత్ ఆరోగ్యం విషమంగా మారిందని తెలుస్తోంది. ఆయన నిలబడలేని పరిస్థితిలో ఉన్నారని అనుచరులు అంటున్నారు. దీంతో మెరుగైన చికిత్స కోసం విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ తండ్రిని దుబాయ్ తీసుకెళ్లాడట. లండన్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు దుబాయ్‌లో చికిత్స చేస్తారని సమాచారం. చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్‌పై ఆయనను తీసుకెళుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి.
విజయ్ కాంత్ కొద్ది రోజుల క్రితం సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించారు. ఆగస్టు 25న పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మళ్లీ ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం దుబాయ్ తీసుకెళ్లారు. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడి నుంచి అమెరికాకు కూడా తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.
Also Read: మీకు అర్థమవుతోందా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రమోషన్లో ఆనంది అందుకే కనిపించలేదంట!
'విరుధగిరి' (2010) ఆయన హీరోగా నటించిన చివరి సినిమా. ఇటీవల కరోనా బారిన పడిన వారి మృతదేహాలను పాతిపెట్టేందుకు తన భూమిని దానం చేశారు. చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీ ఆండల్ అలగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సమీపంలో గల కొంత భూమిని కేటాయిస్తున్నట్లు సెకెండ్ వేవ్ సమయంలో చెప్పారు. ఏదేమైనా ఎయిర్ పోర్టులో వీల్ ఛైర్‌లో కూర్చొన్న విజయ్ కాంత్ ఫొటో చూసిన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సన్నిహితులు కోరుతున్నారు.
Also Read: ‘కార్తికేయ-2’ హీరోయిన్ ఈమే.. నిఖిల్‌తో మళ్లీ జతకడుతున్న ముద్దుగుమ్మ
Also Read: నాలుగు పదులు దాటినా అస్సలు తగ్గట్లేదుగా...బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ లేటెస్ట్ పిక్స్
Also Read: జ్యోతిక హిమాలయ ట్రెక్కింగ్ ఫొటోస్ వైరల్.. అంతలా వైరల్ కావడానికి కారణమేంటి?