తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఆనంది.. తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘ఈ రోజుల్లో’ సినిమాలో స్పెషల్ సాంగులో స్టెప్పులేసిన సోడాల శ్రీదేవి.. ఆ తర్వాత ‘బస్‌స్టాప్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాల్లో నటించింది. అయినప్పటికీ తెలుగులో పెద్దగా కలసిరాకపోవడంతో అందరి తెలుగమ్మాయిల్లా కోలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ ఇప్పటికే డజను సినిమాల్లో నటించింది. మరో అరడజను ఆఫర్లతో బిజీగా ఉంది. ఈ ఆరు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. కోలీవుడ్ లో ఆనంది క్రేజ్ చూసిన తర్వాత మనోళ్లకు మళ్లీ ఆమెవైపు చూపు మళ్లింది.


Also Read: ‘కార్తికేయ-2’ హీరోయిన్ ఈమే.. నిఖిల్‌తో మళ్లీ జతకడుతున్న ముద్దుగుమ్మ


యువ హీరో తేజ సజ్జా డెబ్యూ మూవీ 'జాంబీ రెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. సుధీర్ బాబు - డైరెక్టర్ కరుణ కుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలో ఆనంది నటనకు ఫుల్ మార్క్ పడ్డాయి. మంచి టాక్ సంపాదించుకోవడంతో పాటూ..బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా బాగానే ఉన్నాయంటున్నారు నిర్మాతలు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటివారు కూడా ఆనంది పెరఫామెన్స్ ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అయితే సినిమా ప్రమోషన్లో ఆమె ఎందుకు పాల్గోలేదంటూ పెద్ద చర్చలే జరిగాయి. కానీ అందుకు ఓ కారణం ఉంది. ఆమె గర్భవతి కావడం వల్లే బయటకు రాలేదనే టాక్ వినిపిస్తోంది.



Also Read: నాలుగు పదులు దాటినా అస్సలు తగ్గట్లేదుగా...బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ లేటెస్ట్ పిక్స్


కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ను ప్రేమించిన ఆనంది.. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జనవరి 7న వరంగల్ లో నిరాడంబరంగా వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఆరో నెల అని, అందుకే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేదని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే సోడాల శ్రీదేవి స్పందించాలి మరి.


Also Read: జ్యోతిక హిమాలయ ట్రెక్కింగ్‌ ఫొటోస్ వైరల్‌.. అంతలా వైరల్ కావడానికి కారణమేంటి?


Also Read: మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టిన రోజు ఫొటోలు వైరల్


Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే