భారత జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా 20.1 శాతం వృద్ధి రేటు సాధించినట్లు కేంద్రం వెల్లడించింది.
గతేడాది ఇదే మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 24.4 శాతంగా ఉంది. ఇప్పుడు 20.1 శాతంతో సానుకూలంగా నమోదైంది.
మరోవైపు, పారిశ్రామిక కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్త పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ జులై నెలలో 1.1 పాయింట్లు పెరిగి 122.8కు చేరింది. జూన్ నెలలో ఇది 121.7 పాయింట్లుగా ఉంది.
ఆహార ద్రవ్యోల్బణం
ఆహార ద్రవ్యోల్బణం కూడా స్వల్పంగా తగ్గి 4.91 శాతానికి చేరుకుంది. 2021 జూన్లో ఆహార ద్రవ్యోల్బణం 5.61 శాతం ఉండగా.. గతేడాది జులైలో 6.38 శాతంగా ఉంది.