సంపత్ నంది దర్సకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో గోపీచంద్ –తమన్నా నటించారు. భూమిక కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేసుకుంటూ ఫైనల్ గా సెప్టెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే 'లవ్ స్టోరీ' సినిమా విడుదల వాయిదా అనే వార్తలు రావడంతో సెప్టెంబరు 10న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది యూనిట్. తాజాగా ఈ మూవికి సంబంధించి అపీషియల్ ట్రైలర్ ను హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రయూనిట్.
‘సీటీమార్’ ట్రైలర్ ఇక్కడ చూడండి:
కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపీచంద్.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా కనిపించనుంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్సా? మీకు రూల్స్ తెలుసు కదా’’ అనే డైలాగుతో మొదలైంది. ‘‘ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే కావాల్సింది మగాడి తోడు కాదు ధైర్యం’’ అనే గోపీచంద్ డైలాగ్ తప్పకుండా సీటీమార్ అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లడం అంటూ జరిగితే కప్పు కొట్టే వెళ్లాలన్న తమన్నా డైలాగుతో ట్రైలర్ అదుర్స్ అనిపిస్తుంది. మరోవైపు గోపీచంద్-తమన్నా మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టు ట్రైలర్లో కనిపిస్తోంది. తమ్మూ అందాల విందు కూడా బాగానే ఉంది.
Also Read: ‘కార్తికేయ-2’ హీరోయిన్ ఈమే.. నిఖిల్‌తో మళ్లీ జతకడుతున్న ముద్దుగుమ్మ
వినాయకచవితి కానుకగా ఈనెల 10న విడుదల కాబోతోన్న సీటీమార్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. మరోవైపు తమన్నా మరో మూవీ ‘మ్యాస్ట్రో’ కూడా సెప్టెంబరు మూడోవారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. బాలీవుడ్ మూవీ అంధాదున్ రీమేక్ ఇది. హిందీలో టబు క్యారెక్టర్లో తెలుగులో తమన్నా నటిస్తోంది. మరోవైపు గోపీచంద్ మూవీస్ పర్వాలేదనిపించకున్నా ఈ మధ్యకాలంలో చెప్పుకోదగిన హిట్టు లేదనే అనుకోవాలి. మరి సీటీమార్ మాస్ హీరోని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళుతుందేమో చూడాలి.
Also Read: నాలుగు పదులు దాటినా అస్సలు తగ్గట్లేదుగా...బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ లేటెస్ట్ పిక్స్
Also Read: జ్యోతిక హిమాలయ ట్రెక్కింగ్ ఫొటోస్ వైరల్.. అంతలా వైరల్ కావడానికి కారణమేంటి?
Also Read: మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టిన రోజు ఫొటోలు వైరల్
Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే...