మంచి కథలు వెతికిపట్టుకుని రీమేక్ చేసి హిట్టుకొట్టడంలో వెంకీమామ తర్వాతే ఎవరైనా. ఒకటి కాదు రెండు కాదు విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఎన్నో రీమేక్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని డిజాస్టర్స్ గా మిగిలినా కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే వచ్చిన ‘నారప్ప’ తమిళ మూవీ అసురన్ కి రీమేక్. త్వరలో విడుదల కాబోతున్న ‘దృశ్యం 2’ మలయాళం దృశ్యం 2 కు రీమేక్. త్వరలో ఓ కొరియన్ మూవీ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్. అయితే త్వరలోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న వెంకీ...ఇక్కడ కూడా రీమేక్ సెంటిమెంట్ కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నాడట.


కరోనాకి ముందు తర్వాత చూసుకుంటే ఓటీటీ ట్రెండ్ ఇప్పుడు ఓ రేంజ్ లో ఉంది. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్ల చూపుకూడా ఓటీటీవైపు మళ్లుతోంది. టాలీవుడ్ ఈ కోవలో చాలామంది ఉన్నా సీనియర్ హీరోల్లో మొదట ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నది వెంకటేశ్ కావడం విశేషం . అయితే తన కెరీర్లో ఎన్నో సక్సెస్ లు రీమేక్ సినిమాలద్వారానే వచ్చాయనే ఆలోచనలో ఉన్న వెంకీ... ఓటీటీ ఎంట్రీ కూడా రీమేక్ ద్వారానే ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంలో ఉన్నాడట. ఈ మేరకు ఓ స్పానిష్ వెబ్ సిరీస్ హక్తులను సురేశ్ బాబు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వారు ఆ వెబ్ సిరీస్ ను రీమేక్ చేసేందుకు ప్రయత్నించి డ్రాప్ అయ్యారట. ఇప్పుడా సిరీస్ ను రీమేక్ చేసి ఓటీటీకి అమ్మేసే యోచనలో ఉన్నాడట సురేశ్ బాబు. వెంకటేష్ ఇమేజ్ కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.


Also Read: ఈ సారి ‘అతిథి దేవోభవ’ అంటున్న డైలాగ్ కింగ్ సాయికుమార్‌ తనయుడు


వెంకీ రీమేక్ చేసిన హిట్టుకొట్టిన సినిమాల విషయానికొస్తే ‘గురు’, ‘ఓ మై గాడ్’ రీమేక్ ‘గోపాల గోపాల’, ‘దృశ్యం’, ‘సంక్రాంతి’, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ , ‘చంటి’,’ వారసుడొచ్చాడు’,’ ధృవనక్షత్రం’, ‘బ్రహ్మపుత్రుడు’. ఇలా రీమేక్ లతో సెన్షేషనల్ సక్సెస్  దక్కించుకున్నాడని..ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కూడా రీమేక్ కావడంతో సక్సెస్ పక్కా అంటున్నారు దగ్గుపాటి అభిమానులు.


Also Read: నాలుగేళ్ల తర్వాత మళ్లీ హాలీవుడ్‌లోకి దీపిక..ఈసారి హీరోయిన్‌గా మాత్రమే కాదండోయ్..


Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..


Also Read:నిర్మాతగా తాప్సి.. తొలి సినిమా ‘బ్లర్’ షూటింగ్ పూర్తి, నైనిటాల్‌లో సంబరాలు