జేమ్స్ బాండ్(James Bond)  సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. జేమ్స్ బాండ్ 007 తాజా సీరిస్ ‘నో టైమ్ టు డై’ (No Time to Die) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ సినిమా గతేడాది ఏప్రిల్ నెలలోనే విడుదల కావాలి. కానీ, కరోనా వైరస్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు కాస్త కరోనా కేసులు తగ్గి, థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ చిత్రం విడుదలకు సన్నహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మరో తాజా ట్రైలర్‌తో విడుదల తేదీని ప్రకటించారు.


ఈ నెల 28వ తేదీన లండన్‌లోని రాయల్ ఆలబర్ట్ హాల్‌లో ఈ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. హీరో డానియల్ క్రేగ్‌తోపాటు నిర్మాతలు  మైఖేల్ జీ విల్సన్, బార్బరా బ్రక్కోలీ, డైర‌క్టర్ కారీ జోజి ఫుకునాగాలు ఈ షోకు హాజరుకానున్నారు. ‘జేమ్స్ బాండ్’ సిరీస్‌లో ‘నో టైమ్ టు డై’ 25వ చిత్రం కావడం విశేషం. అంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 24 సీరిస్‌లు వచ్చాయన్న మాట. 


బ్రిటీష్ గూడచారి జేమ్స్ బాండ్ చేసే విన్యాసాలను చేసేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఈ సారి నేరుగా తెలుగులో కూడా సినిమాను అనువాదించి విడుదల చేస్తుంది. ఈ మేరకు యూనివర్శల్ పిక్చర్స్ ఇండియా గతేడాది ‘జేమ్స్ బాండ్ - నో టైమ్ టు డై’ తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేసింది. తాజాగా విడుదల తేదీని ఖరారు చేస్తూ ఇంటర్నేషనల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. సెప్టెంబరు 30వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించింది. 


ఇక కథ విషయానికి వస్తే.. నో టైమ్ టు డైలో బాండ్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. జమైకాలో ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. అయితే CIAలోని అతడి అతడి పాత స్నేహితుడు ఫెలిక్స్ లీటర్ సహాయం కోరడంతో మళ్లీ రంగంలోకి దిగాల్సి వస్తుంది. కిడ్నాప్‌కు గురైన శాస్త్రవేత్తను రక్షించే మిషన్‌లో పాల్గొంటాడు. అయితే, అతడు ఊహించిన దానికంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ సందర్భంగా సరికొత్త టెక్నాలజీతో అసాంఘిక చర్యలకు పాల్పడే విలన్‌తో పోరాడాల్సి వస్తుంది. చివరికి ఏం జరుగుతుందనేది బిగ్‌స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ చిత్రానికి క్యారీ జోజీ ఫ్యూకునగా దర్శకత్వం వహిస్తున్నారు. మైఖెల్ విల్సన్, బార్బరా బ్రోక్కోలీ నిర్మాతలు. డేనియల్ క్రేగ్‌తోపాటు  రాల్ఫ్ ఫియెన్స్, నవోమీ హారిస్, రోరీ కిన్నీర్, లియా సెడౌక్స్, బెన్ విషా, జెఫ్రీ రైట్, అనా డి అర్మాస్, డాలీ బెన్సాలా, డేవిడ్ డెన్సిక్, లషనా లించ్, బిల్లీ మాగ్నస్సేన్ మరియు రామి మాలెక్ నటిస్తున్నారు. 


No Time to Die – International Trailer:


‘నో టైమ్ టు డై’ తెలుగు ట్రైలర్:


Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?


Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..