Dengue Fever in UP: యూపీలో మిస్టరీ ఫీవర్.. 40 మందికి పైగా మృతి

ABP Desam Updated at: 01 Sep 2021 01:18 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్ ప్రదేశ్ లో వింత వ్యాధితో 40 మందికి పైగా మృతి చెందారు. పాఠశాలలు తెరిచే ముందు ఇలా కొత్త వ్యాధి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ లో వింత వ్యాధి

NEXT PREV

ఉత్తర్ ప్రదేశ్ లో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఓవైపు కరోనాతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే మరోవైపు డెంగ్యూలాంటి జ్వరంతో ఇప్పటికే యూపీలో దాదాపు 40 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు.


పాఠశాలలు తెరిచేలోపు..


పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇలాంటి తరుణంలో ఫిరోజాబాద్ జిల్లాలో డెంగ్యూ లాంటి జ్వరంతో 40 మంది మృతి చెందడంతో ప్రభుత్వం షాక్ అయింది. బాధిత కుటుంబాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు.


మొత్తం 32 మంది చిన్నారులు సహా ఏడుగురు మరణించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 18న మొదటి కేసును గుర్తించినట్లు పేర్కొన్నారు.


కొంతమంది రోగుల శాంపిల్స్ ను లఖ్ నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ,  పుణెలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని ఆదేశించారు. ఫిరోజాబాద్ లో శానిటైజేషన్ పనులను పక్కాగా నిర్వహించాలని సీఎం అధికారులను సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్-19 వార్డ్ లో ఈ రోగులకు చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.


ఎన్డీటీవీ నివేదిక ప్రకారం ఈ అంతుచిక్కని జ్వరంతో 10 రోజుల్లో 53 మంది చనిపోగా ఇందులో 45 మంది చిన్నారులున్నట్లు తేలింది. ఈ వ్యాధితో వారం రోజుల్లో 40 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీషా అసిజా తెలిపారు. అయితే ఈ వార్తలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఖండించారు. అంతమంది చనిపోయినట్లు ఎక్కడా నివేదికలు రాలేదన్నారు.


కొవిడ్ కు దీనికి లింకుందా?


కరోనా థర్డ్ వేవ్ కు ఇది సంకేతమా అనే అనుమాలను ఫిరోజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఖండించారు. 



భారీ వర్షాలు, నీరు నిలిచిపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు ప్రబలాయి. పిల్లల్లో ఈ జ్వరం గుణాలకు ఇదే కారణం. ఈ బాధితులు అందరికీ కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చింది.                                -  చంద్ర విజయ్ సింగ్, ఫిరోజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్


మరిన్ని జిల్లాల్లో..


ఫిరోజాబాద్ తో పాటు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర, మణిపురి లో కూడా ఈ వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. 

Published at: 01 Sep 2021 01:18 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.