వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో వరుస సర్ ప్రైజ్ లు ఇస్తూ అభిమానుల్ని ఆనందంలో ముంచేస్తున్నాడు. ఇప్పటికే ‘భీమ్లానాయక్’ ఫస్ట్ గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఫస్ట్‌ గ్లింప్స్‌కు వచ్చిన స్పందన, అందులో డైలాగులతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి ‘భీమ్లానాయక్‌’ టీమ్ సిద్ధంగా ఉంది. సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.16 నిమిషాలకు చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సాగర్‌ కె చంద్ర ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.  ‘‘మండుతున్న రైఫిల్స్‌ ప్రతిధ్వనించడానికి సిద్ధమవుతున్నాయి. పవర్‌ అంథమ్‌తో పవర్‌డేను సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు.


Get Ready to FEEL the SOUND of POWER ANTHEM in 2 Days 🔊🔥#BheemlaNayakTitleSong on 2nd Sept at 11:16AM💥🥁#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/mZIra2qbzo






మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘భీమ్లానాయక్’ ను  సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు,  స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు.


Also Read: ఆడపిల్ల బయటకు వెళ్లాలంటే కావాల్సింది మగాడితోడు కాదు ధైర్యం..దుమ్ము దులిపేసిన ‘సీటీమార్’ ట్రైలర్


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -  క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా తెరకెక్కుతోంది. ఇది పవన్ నటిస్తున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీనే కాకుండా.. పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రం . మొఘలాయిల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న ఈ మూవీ కోసం చార్మినార్ , బందర్ పోర్ట్ సహా పలు చారిత్రక ప్రదేశాల సెట్లు ఏర్పాటు చేశారు. పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్,  బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్,  మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఎమ్ రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడు.


మరోవైపు హరీష్‌శంకర్‌, సురేందర్‌ రెడ్డి తో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కోసం ఇప్పుడు మరో ఇద్దరు కొత్త దర్శకులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాస్తవికతకి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీస్తున్న ఆ దర్శకులతో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు కథలు సిద్ధం చేయిస్తున్నాయని తెలుస్తోంది. వీటిపై మరికొన్ని రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సెప్టెంబర్‌ 2న ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ గీతంతో పాటూ పవర్ స్టార్ అభిమానులకు ఇంకా ఎన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయో చూడాలి.


Also Read: మీకు అర్థమవుతోందా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రమోషన్లో ఆనంది అందుకే కనిపించలేదంట!


Also Read: మళ్లీ విషమించిన కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యం.. దుబాయ్‌కు తరలింపు


Also Read: ప్రశాంతంగా సెలవు తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూడండి.. ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ బంపరాఫర్..