వెబ్ సిరీస్‌లంటే ఎవరికి నచ్చదు చెప్పండి. వీకెండ్‌లో ఏ సిరీస్ చూద్దామా అని చాలా మంది టెకీలు ముందే ప్లాన్ చేసుకుంటారు. ఇక కోవిడ్ కాలంలో చాలా మందికి టైమ్ పాస్ అవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్లలో వెబ్ సిరీస్‌లు ఒకటని చెప్పవచ్చు. 
రాజస్తాన్ కు చెందిన ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. వేర్వ్ లాజిక్ (Verve Logic) అనే కంపెనీ త్వరలో రిలీజ్ కాబోతున్న ఓ వెబ్ సిరీస్‌ చూసేందుకు తమ ఉద్యోగులకు ఒక రోజు సెలవు ఇచ్చింది. గత రెండేళ్ల నుంచి తమ కంపెనీ ఉద్యోగులంతా తీవ్రంగా కష్టపడుతున్నారని.. అందుకే వారి కోసం కొంత ఫ్రీ టైమ్ ఉండాలనే ఉద్దేశంతో సెలవు ఇచ్చినట్లు కంపెనీ సీఈవో అభిషేక్ జైన్ వెల్లడించారు. మొదట ఆఫీసులోనే వెబ్ సిరీస్ ప్లే చేద్దామని అనుకున్నామని.. తర్వాత లీవ్ ఇద్దామని డిసైడ్ అయినట్లు తెలిపారు. నెట్ ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఓ వెబ్ సిరీస్ చూసేందుకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సెలవు ఇవ్వడం మాత్రమే కాదు, నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ నిర్ణయం పట్ల ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేశారు.




Also Read: Money Heist Season 5: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!


Also read: Seetimaarr Trailer: ఆడపిల్ల బయటకు వెళ్లాలంటే కావాల్సింది మగాడితోడు కాదు ధైర్యం..దుమ్ము దులిపేసిన ‘సీటీమార్’ ట్రైలర్