ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది డీఎస్పీ (సివిల్) లకు అదనపు ఎస్పీలుగా (సివిల్) పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 బ్యాచ్‌కు చెందిన 40 మంది డీఎస్పీల పదోన్నతుల అంశం గత 5 ఏదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. వీరికి అడిషనల్ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా పదోన్నతి కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు అధికారులకు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు డీఎస్పీలకు పదోన్నతులు కల్పిస్తూ.. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కోర్టులో లేదా ట్రిబ్యునల్‌లో ఏవైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన డీఎస్పీలు..
సి.జయరాం రాజు, ఇ. నాగేంద్రుడు, జి.వెంకటేశ్వరరావు, ఏవీ సుబ్బరాజు, ఎం.స్నేహిత, కె.శ్రీలక్ష్మి, బి.నాగభూషణ రావు, జి.రామ కృష్ణ, ఆర్.రమణ, ఎ.శ్రీనివాసరావు, జి. స్వరూప రాణి, లింగాల అజయ్‌ప్రసాద్, ఏవీఆర్ పీవీ ప్రసాద్, పి.మహేశ్, టి.ప్రభాకర్ బాబు, జేవీ సంతోష్, నడికొండ వెంకట రామాంజనేయులు, డి.సూర్య శ్రావణ కుమార్, వీబీ రాజ్ కమల్, కె.శ్రావణి, ఎం.చిదానంద రెడ్డి, దిలీప్ కిరణ్ వండ్రు, కె.నాగేశ్వరరావు, డి.శ్రీ భవానీ హర్ష, అనిల్ కుమార్ పులపాటి, కె.సుప్రజ, జి. వెంకట రాముడు, హస్మా ఫరీణ్, పి.సౌమ్య లత, డి.ప్రసాద్, జె.కులశేఖర్, కె.శ్రీనివాసరావు, పూజిత నీలం, బి.విజయ భాస్కర్, జె.వెంకట్రావ్, సీహెచ్ సౌజన్య, ఏటీవీ రవికుమార్, మహేంద్ర మాతే, ఎ.రాజేంద్ర, బి.శ్రీనివాసరావు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.
తెలంగాణలో 19 మంది డీఎస్పీల ట్రాన్స్‌ఫర్..
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను బదిలీ చేసి ఆర్టీసీ ఎండీగా నియమించిన ప్రభుత్వం.. తాజాగా మరో 19 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. వీరితో పాటు మరో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ హోదా ఇచ్చి పదోన్నతి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉమేష్ షరాఫ్, గోవింద్ సింగ్, రవి గుప్తాకు డీజీపీ హోదాను కల్పించింది. పదోన్నతి, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను డీజీపీ మహేందర్ రెడ్డి జారీ చేశారు.
Also Read: ఏ నెల పింఛను ఆ నెలలోనే.. 2 నెలలది ఒకేసారి ఇవ్వడం కుదరదు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం..
Also Read: Joe Biden: అమెరికా బలగాల ఉపసంహరణ సరైన నిర్ణయమే.. తాలిబన్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. జో బైడెన్