2021 సెప్టెంబర్ 1 రాశిఫలాలు
మేషం
సెప్టెంబరు నెలలో మొదటి రోజు మేషరాశివారికి అంతా అనుకూలంగా ఉంది. ఇంటికి స్నేహితులు వస్తారు. శుభవార్త వింటారు. సంతోషంగా ఉంటారు. పెళ్లి సంబంధాలు వెతుక్కునే వారికి అనుకూల సమయం. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఇతరులు చెప్పే విషయంపై ఆధారపడొద్దు.కార్యాలయంలో వాతావరణం సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
వృషభం
ఈ రోజు పెట్టుబడి పెట్టే ఆలోచన విరమించుకోండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార సమస్యలను సులువుగా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరులకు సహాయం చేస్తారు. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలపట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. తెలియని అడ్డంకులు తొలగిపోతాయి.
మిథునం
ఈరోజు మీకు అద్భుతమైన రోజు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. అప్పులిచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. తెలియని వ్యక్తులతో అనవసర వ్యవహారాలు వద్దు. మంచి సమాచారం పొందుతారు. కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. వాహనాలు, యంత్రాల వాడకంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను మీ వద్ద ఉంచుకోండి. తెలివిగా ఖర్చు చేయండి. వివాదం ముగిసిన తర్వాత ఆనందం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కలిసొచ్చే సమయం.
కర్కాటక రాశి
మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. మతపరమైన యాత్రను చేసే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనా విధానం మారుతుంది. రిస్క్ తీసుకోవద్దు. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిచిపోతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
సింహం
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన పనులు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామిని అనవసరంగా అనుమానించవద్దు. కుటుంబ పనులను పూర్తి చేయండి. కెరీర్ కి కొత్త మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కలిసొచ్చే కాలం.
కన్య
మీ ప్రయత్నంలో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్య సమస్య పరిష్కారమవుతాయి. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. రిస్క్ తీసుకోకండి. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మారుతుంది. తెలియని అడ్డంకులు తొలగిపోతాయి. మీ పనులను సమర్ధవంతంగా పూర్తి చేయగలరు. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
తులారాశి
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. మతపరమైన ప్రయాణం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి సమస్య ఉండవచ్చు. రిస్క్ తీసుకోకండి. మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులు ఈ రోజు కొత్త వ్యాపార ప్రణాళికను రూపొందించవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
వృశ్చికరాశి
ఏ విషయంలోనూ తొందరపడకండి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. పెట్టుబడి నుంచి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు గొప్ప బాధ్యతను పొందేఅవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ప్రమోషన్ ఉంటుంది. మీకు బంధువుల మద్దతు లభిస్తుంది. పిల్లల చదువులు బాగుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు
మీరు కొత్త ఉద్యోగంలో చేరేందుకు అనుకూల సమయం. ఖర్చులు పెరుగుతాయి. గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికంగా కలిసొచ్చే సమయం. వ్యాపారానికి సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేసేందుకు అనుకూల సమయం. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. విద్యార్థులకు కలిసొచ్చే రోజు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
మకరం
ఇచ్చిన అప్పును తిరిగి పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మధురానుభూతి ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ప్రయాణాలు చేయవద్దు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యర్థులకు దూరంగా ఉండాలి. కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఆహారంలో అజాగ్రత్తగా ఉండకండి.
కుంభం
అనవసర చర్చల్లో తలదూర్చకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారస్తులకు అనుకూలం సమయం. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఇప్పటికే పెట్టుబడి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ వైవాహిక జీవితం బావుంటుంది.
మీనం
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. పెట్టుబడి ఆఫర్లు పొందుతారు. ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుండి లాభం పొందుతారు. స్నేహితులను కలిసే అవకాశం ఉంది. కుటుంబం కోసం సమయం కేటాయించండి. మీ కెరీర్ గురించి చింతించకండి..మంచి అవకాశాలు తలుపుతడతాయి.