తాప్సీ గురించి ఒక్కమాటలో చెప్పుకోవాలంటే టాలీవుడ్ ఐరెన్ లెగ్..బాలీవుడ్ గోల్డెన్ లెగ్. మంచు మనోజ్‌తో ‘ ఝమ్మంది నాదం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెల్లపిల్ల ప్రభాస్ తో కలసి నటించిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ మినహా మిగిలిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. పైగా ఐరెన్ లెగ్ అనే ముద్ర పడడంతో బాలీవుడ్ కి ఎగిరిపోయింది. అక్కడ అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమోకానీ పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఆమె కెరీర్ దూసుకుపోతోంది. తాప్సీ నటించిన ‘పింక్’ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో అక్కడే తిష్టవేసింది. మరీ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోకపోయినా తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. బీటౌన్‌లో క్రేజ్ వచ్చిన తర్వాత తెలుగులో కూడా ‘ఆనందోబ్రహ్మ’ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు కొత్తగా నిర్మాణ రంగంలోకి అడగుపెట్టిన తాప్సీ బ్లర్ మూవీకి నిర్మాతగా మారింది. ఆ సినిమా షూటింగ్ పూరికావడంతో నైనిటాల్ లో మూవీ యూనిట్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ి
సైకలాజికల్ థ్రిల్లర్ ‘బ్లర్’ సినిమాలో తాప్సీ పన్ను, గుల్షన్ దేవయ్య నటించారు. ఇది స్ట్రైట్ మూవీ కాదు 2010లో విడుదలైన 'జూలియాస్ ఐస్' అనే స్పానిష్ మూవీకి రీమేక్ ఇది. కథ విషయానికొస్తే తన సోదరి అనుమానస్పద మృతి వెనుక రహస్యాన్ని ఛేదించే క్రమంలో నెమ్మదిగా తన చూపు కోల్పోయే ఓ మహిళ కథ ఇది. దాదాపు రెండు గంటల పాటూ సాగే ఈ హారర్ థ్రిల్లర్ అప్పట్లో ఆ జోనర్ ప్రేక్షకులని భలే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఏకంగా ఐదు భారతీయ భాషల్లో రూపొందుతోంది.
తాప్సీ ప్రధాన పాత్రలో `బ్లర్` పేరుతో ఆమె స్వీయ నిర్మాణంలోనే హిందీ వెర్షన్ తెరకెక్కుతోంది. మరాఠీలో `సిద్ధు ఫ్రమ్ సికాకుళం` ఫేమ్ మంజరి ఫడ్నీస్, రితేశ్ దేశ్ ముఖ్ ముఖ్య పాత్రల్లో `అదృశ్య` పేరుతో రూపుదిద్దుకుంటోంది. ఇక బెంగాలీలో రీతూపర్ణ సేన్ గుప్తా మెయిన్ లీడ్ గా `అంతర్ దృష్టి` టైటిల్‌తో రీమేక్ అవుతోంది. తమిళంలో `ఉన్ పార్వైల్` పేరుతో షూటింగ్ జరుగుతోంది. అలాగే తెలుగులో `అగోచర` పేరుతో ఇషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమా స్పానిష్ మూవీకి రీమేక్ అని టాక్.
మొత్తంమీద 11 ఏళ్ళ నాటి స్పానిష్ హారర్ థ్రిల్లర్ 'జూలియాస్ ఐస్' ఇప్పుడు ఏకంగా ఐదు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుండడం విశేషమనే చెప్పాలి. ఈ మధ్య అలా అన్ని భాషాల్లో రీమేక్ అయి సూపర్ హిట్టైన సినిమా ఏదంటే ‘దృశ్యం’ అని చెప్పాలి. హిందీలో ఇప్పటికే షూటింగ్ పూర్తైన బ్లర్ మూవీ టీమ్ మొత్తం నైనిటాల్ లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..
Also Read: ఆడపిల్ల బయటకు వెళ్లాలంటే కావాల్సింది మగాడితోడు కాదు ధైర్యం..దుమ్ము దులిపేసిన ‘సీటీమార్’ ట్రైలర్
Also Read: మీకు అర్థమవుతోందా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రమోషన్లో ఆనంది అందుకే కనిపించలేదంట!
Also Read: ప్రశాంతంగా సెలవు తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూడండి.. ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ బంపరాఫర్..