కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు అర్థంతరంగా రద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే కాస్త రద్దయిన టోర్నీలను తిరిగి ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ప్రతిష్టాత్మక టోర్నీ అర్హత మ్యాచ్‌లు రద్దయ్యాయి.
2022లో జరగబోయే పురుషుల T20 ప్రపంచకప్, 2023లో జరగబోయే మహిళల T20 ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా ఈస్ట్ ఆసియా పసిఫిక్ దేశాలు జపాన్ వేదికగా తలపడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరగడంతో అర్హత పోటీలను రద్దు చేస్తున్నట్లు ICC హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లీ ప్రకటించారు.
కరోనా కేసులు పెరగడంతో పలు దేశాలు ట్రావెలింగ్ పై ఆంక్షలు విధించాయి. అలాగే జపాన్ చేరుకున్న తర్వాత ఆటగాళ్లు క్వారంటైన్ అవ్వాలి. ఆంక్షలు ఎప్పుడు సడలిస్తారో తెలియదు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని పోటీలను రద్దు చేస్తున్నట్లు టెట్లీ తెలిపారు.
పురుషుల అర్హత పోటీల్లో కుక్ ఐస్‌లాండ్స్,జపాన్, ఫిజ్జి, ఫిలిఫ్పైన్స్, ఇండోనేషియా, సమోయ, దక్షిణ కొరియా, Vanuatu దేశాలు అక్టోబరు 18 నుంచి 23 మధ్య తలపడాల్సి ఉంది. అలాగే 2023 టీ20 మహిళల ప్రపంచకప్ టోర్నీ కోసం కుక్ ఐస్‌లాండ్స్. ఫిజ్జి, ఇండోనేషియా, జపాన్, ఫిలిఫ్పైన్స్, PNG, సమోయ, Vanuatu దేశాలు నవంబరు 7 నుంచి 12 మధ్య తలపడాల్సి ఉంది.
Also Read: Ranji Trophy: రంజీ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసిన BCCI... జనవరి 13 నుంచి మ్యాచ్‌లు
ప్రస్తుత ర్యాంకింగ్ ఆధారంగా పురుషుల ఫిలిఫ్పైన్స్ జట్టు తదుపరి స్టేజ్‌కి అర్హత సాధించింది. మెక్సికోలో జరిగే మహిళల క్వాలిఫైయర్ మ్యాచ్‌ల తేదీలను ICC మార్చింది. ఇప్పుడు ఈ టోర్నమెంట్ అక్టోబరు 18 నుంచి 25 మధ్య జరగనుంది. అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, అమెరికా జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. 30 నవంబరు 2021 నాటికి ర్యాంకుల ఆధారంగా మహిళల అర్హత టోర్నీల్లో పాల్గొనే జట్లపై స్పష్టత రానుందని టెట్లీ చెప్పారు.