ABP  WhatsApp

Shahid Afridi Supports Taliban: తాలిబన్లు 'పాజిటివ్ మైండ్'తో ఉన్నారు.. వాళ్లకి క్రికెట్ అంటే ఇష్టం: అఫ్రిదీ

ABP Desam Updated at: 31 Aug 2021 05:50 PM (IST)

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాలిబన్లకు మద్దతుగా అఫ్రిదీ చేసిన కామెంట్స్ పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.

తాలిబన్లకు షాహిద్ అఫ్రిదీ మద్దతు

NEXT PREV

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీపై నెటిజన్లు మరోసారి ఫైర్ అవుతున్నారు. తాలిబన్లకు మద్దతుగా అఫ్రిదీ వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. 44 ఏళ్ల ఈ క్రికెటర్ అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు.


Also Read: Covid C.1.2 Strain: ఇదేందిరా సామి..! మళ్లీ కొత్త వేరియంటా? వ్యాక్సిన్ కూడా పనిచేయదా?


ఏమన్నాడు?


తాజాగా అఫ్గానిస్థాన్, తాలిబన్లపై అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాలిబన్లపై ప్రశంసలు కురిపించాడు. వాళ్లు పాజిటివ్ మైండ్ తో ఉన్నారని అఫ్రిదీ అన్నాడు.



తాలిబన్లు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నారు. మహిళలు ఉద్యోగం చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అంతేకాకుండా తాలిబన్లకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటున్నాను.                             -  షాహిద్ అఫ్రిదీ, పాకిస్థాన్ మాజీ క్రికెటర్


Also Read: ABP EXCLUSIVE: 'భయపడుతూ బతకలేను.. తాలిబన్లు చెప్పింది చేయలేను.. అందుకే పారిపోయా'


వైరల్..


అయితే ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. అఫ్గాన్ లో మహిళలపై తాలిబన్లు దారుణంగా వ్యవహరిస్తుంటే.. వారిని ఎలా ప్రశంసిస్తారంటూ అఫ్రిదీని ప్రశ్నిస్తున్నారు.














అఫ్రిదీ మొత్తం 37 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. ప్రస్తుతం ఇంకా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నాడు.

Published at: 31 Aug 2021 05:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.