అమెరికా దళాలు పూర్తిగా వెనుదిరిగిన తర్వాత అఫ్గానిస్థాన్ ఎమైపోతుందోనని ప్రపంచం ఆందోళన చెందుతోంది. అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఇంకెత్త రెచ్చిపోతారోనని అఫ్గాన్ వాసులు హడలిపోతున్నారు.
ముఖ్యంగా మహిళలపై మళ్లీ ఆంక్షలు తప్పవని ఇప్పటికే పలు సంఘటనలతో అర్థమైంది. ఇది ముందే గ్రహించిన అఫ్గాన్ వాసులు ఇప్పటికే చాలా మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇటీవల తాలిబన్ నేతను ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ బెహెస్తా అర్ఘాంద్ కూడా అఫ్గాన్ ను విడిచి వెళ్లారు. అయితే ఆమె ABPతో ప్రత్యేకంగా మాట్లాడారు.
భయపడి వెళ్లిపోయాను..
మీడియా, అధికార యంత్రాంగంలో మహిళలు పనిచేయడానికి తాలిబన్లు అనుమతించరని ఆమె అన్నారు. మహిళా హక్కులు, మానవ హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారని బెహెస్తా అన్నారు. బాలికల విద్య కోసం తాలిబన్లు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
Also Read: Afganisthan Crisis Update: అఫ్గానిస్థాన్ కు అమెరికా బైబై.. తాలిబన్లు జాయ్ జాయ్
సంచలన ఇంటర్వ్యూ..
ఆగస్టు 17న అఫ్గాన్ చరిత్రలో తొలిసారి తాలిబన్ ప్రతినిధి టీవీ స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది కూడా ఓ మహిళా యాంకర్‌కు ఇవ్వడం సంచలనమే. బెహెస్తా అర్ఘాంద్ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మహిళా హక్కులను తాము కాలరాయబోమని చెప్పేందుకు తాలిబన్లు ప్రయత్నించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే మహిళలను ఉద్యోగాలకు రాకుండా అడ్డుకున్నారు. ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. పైకి మాత్రం మహిళా హక్కులను కాపాడతామని చెబుతున్నారు.
Also Read: Yohani De Silva: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?