Ind vs Pak, T20 WC LIVE: 17.5 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 152-0, పది వికెట్లతో పాకిస్తాన్ విజయం

T20 World Cup, Ind vs Pak LIVE: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ నేటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి.

ABP Desam Last Updated: 24 Oct 2021 11:01 PM
17.5 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 152-0, పది వికెట్లతో పాకిస్తాన్ విజయం

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు సాధించి పాకిస్తాన్ 10 వికెట్లతో విజయం సాధించింది.
బాబర్ ఆజమ్ 68(52)
మహ్మద్ రిజ్వాన్ 79(55)
మహ్మద్ షమీ 3.5-0-43-0

17 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 135-0, లక్ష్యం 152 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 66(51)
మహ్మద్ రిజ్వాన్ 64(51)
భువనేశ్వర్ కుమార్ 3-0-25-0

16 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 128-0, లక్ష్యం 152 పరుగులు

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 63(48)
మహ్మద్ రిజ్వాన్ 61(48)
మహ్మద్ షమీ 3-0-25-0

15 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 121-0, లక్ష్యం 152 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 30 బంతుల్లో 31 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 62(46)
మహ్మద్ రిజ్వాన్ 56(44)
బుమ్రా 3-0-22-0

14 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 112-0, లక్ష్యం 152 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 36 బంతుల్లో 40 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 61(45)
మహ్మద్ రిజ్వాన్ 48(39)
రవీంద్ర జడేజా 4-0-28-0

13 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 101-0, లక్ష్యం 152 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 42 బంతుల్లో 51 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 52(41)
మహ్మద్ రిజ్వాన్ 46(37)
వరుణ్ చక్రవర్తి 4-0-33-0

12 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 85-0, లక్ష్యం 152 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 48 బంతుల్లో 67ద పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 44(38)
మహ్మద్ రిజ్వాన్ 38(34)
రవీంద్ర జడేజా 3-0-17-0

11 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 80-0, లక్ష్యం 152 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. రెండో బంతికి బాబర్ ఆజమ్ ఫోర్ కొట్టాడు. పాకిస్తాన్ విజయానికి 54 బంతుల్లో 72 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 43(36)
మహ్మద్ రిజ్వాన్ 35(30)
బుమ్రా 3-0-17-0

10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 71-0, లక్ష్యం 152 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి బాబర్ ఆజమ్ ఫోర్ కొట్టాడు. పాకిస్తాన్ విజయానికి 60 బంతుల్లో 81 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 34(30)
మహ్మద్ రిజ్వాన్ 35(30)
వరుణ్ చక్రవర్తి 3-0-17-0

9 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 62-0, లక్ష్యం 152 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి బాబర్ ఆజమ్ సిక్సర్ కొట్టాడు. పాకిస్తాన్ విజయానికి 66 బంతుల్లో 90 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 28(27)
మహ్మద్ రిజ్వాన్ 32(27)
రవీంద్ర జడేజా 2-0-13-0

8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 52-0, లక్ష్యం 152 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 72 బంతుల్లో 100 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 20(23)
మహ్మద్ రిజ్వాన్ 30(25)
వరుణ్ చక్రవర్తి 2-0-8-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 46-0, లక్ష్యం 152 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 78 బంతుల్లో 106 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 18(21)
మహ్మద్ రిజ్వాన్ 27(21)
రవీంద్ర జడేజా 1-0-3-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 43-0, లక్ష్యం 152 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 84 బంతుల్లో 109 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 17(17)
మహ్మద్ రిజ్వాన్ 25(19)
భువనేశ్వర్ కుమార్ 2-0-18-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 35-0, లక్ష్యం 152 పరుగులు

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మూడో బంతికి బాబర్ ఆజమ్, ఐదో బంతికి రిజ్వాన్ ఫోర్లు కొట్టారు. పాకిస్తాన్ విజయానికి 90 బంతుల్లో 117 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 14(14)
మహ్మద్ రిజ్వాన్ 21(16)
మహ్మద్ షమీ 2-0-19-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 24-0, లక్ష్యం 152 పరుగులు

వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 96 బంతుల్లో 128 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 9(11)
మహ్మద్ రిజ్వాన్ 15(13)
వరుణ్ చక్రవర్తి 1-0-2-0

మూడు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 22-0, లక్ష్యం 152 పరుగులు

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 102 బంతుల్లో 130 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 8(6)
మహ్మద్ రిజ్వాన్ 14(12)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-4-0

రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 18-0, లక్ష్యం 152 పరుగులు

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. బాబర్ ఆజమ్ ఫోర్ కొట్టాడు. పాకిస్తాన్ విజయానికి 108 బంతుల్లో 134 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 5(3)
మహ్మద్ రిజ్వాన్ 14(10)
మహ్మద్ షమీ 1-0-8-0

మొదటి ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 10-0, లక్ష్యం 152 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రిజ్వాన్ ఫోర్, సిక్సర్ కొట్టాడు.
బాబర్ ఆజమ్ 0(0)
మహ్మద్ రిజ్వాన్ 10(6)
భువనేశ్వర్ కుమార్ 1-0-10-0

20 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 151-7, పాకిస్తాన్ లక్ష్యం 152

రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా అవుటయ్యాడు.
షమీ 0(0)
భువనేశ్వర్ కుమార్ 5(4)
రౌఫ్ 4-0-25-1
హార్దిక్ పాండ్యా (సి) బాబర్ ఆజమ్ (బి) రౌఫ్ (11: 8 బంతుల్లో, రెండు ఫోర్లు)

19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 144-6

షహీన్ అఫ్రిది వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు.
హార్దిక్ పాండ్యా 9(5)
భువనేశ్వర్ కుమార్ 1(1)
షహీన్ అఫ్రిది 4-0-31-3
విరాట్ కోహ్లి (సి) రిజ్వాన్ (బి) షహీన్ అఫ్రిది (57: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)

జడేజా అవుట్.. 18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 127-5

హసన్ అలీ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. తర్వాతి బంతికే బౌండరీ కొట్టాడు. ఐదో బంతికి జడేజా అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు.
విరాట్ కోహ్లి 57(48)
హార్దిక్ పాండ్యా 0(0)
హసన్ అలీ 4-0-44-2
రవీంద్ర జడేజా (సి) నవాజ్ (బి) హసన్ అలీ (13: 11 బంతుల్లో, ఒక ఫోర్)

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 114-4

రౌఫ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లి 48(44)
రవీంద్ర జడేజా 9(11)
రౌఫ్ 3-0-19-0

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 110-4

హసన్ అలీ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టాడు.
విరాట్ కోహ్లి 46(40)
రవీంద్ర జడేజా 7(9)
హసన్ అలీ 3-0-31-1

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 100-4

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లి 37(35)
రవీంద్ర జడేజా 6(8)
షాదబ్ ఖాన్ 4-0-22-1

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 96-4

రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి కోహ్లీ ఫోర్ కొట్టాడు.
విరాట్ కోహ్లి 35(33)
రవీంద్ర జడేజా 4(4)
రౌఫ్ 2-0-15-0

13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 87-4

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. రిషబ్ పంత్ అవుటవ్వడంతో క్రీజులోకి జడేజా వచ్చాడు.
విరాట్ కోహ్లి 29(29)
రవీంద్ర జడేజా 1(1)
షాదబ్ ఖాన్ 3-0-18-1

రిషబ్ పంత్ అవుట్

షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రిషబ్ పంత్ అవుటయ్యాడు.
రిషబ్ పంత్ (సి అండ్ బి) షాదబ్ ఖాన్ (39: 30 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 81-3

హసన్ అలీ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఓవర్ రెండో, మూడో బంతులను రిషబ్ పంత్ సిక్సర్లు కొట్టాడు.
విరాట్ కోహ్లి 28(27)
రిషబ్ పంత్ 37(28)
హసన్ అలీ 2-0-21-1

11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 66-3

హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లి 28(26)
రిషబ్ పంత్ 22(23)
హరీస్ రౌఫ్ 1-0-6-0

10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 60-3

మహ్మద్ హఫీజ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రెండో బంతికి రిషబ్ పంత్ ఫోర్ కొట్టాడు.
విరాట్ కోహ్లి 26(24)
రిషబ్ పంత్ 19(19)
మహ్మద్ హఫీజ్ 2-0-12-0

9 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 52-3

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. ఓవర్ చివరి బంతికి రిషబ్ పంత్ ఫోర్ కొట్టాడు.
విరాట్ కోహ్లి 24(22)
రిషబ్ పంత్ 13(15)
షాదబ్ ఖాన్ 2-0-12-0

8 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 43-3

మహ్మద్ హఫీజ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లి 21(19)
రిషబ్ పంత్ 6(11)
మహ్మద్ హఫీజ్ 1-0-4-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 39-3

షాదబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లి 20(18)
రిషబ్ పంత్ 4(7)
షాదబ్ ఖాన్ 1-0-3-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 36-3

హసన్ అలీ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. ఆఖరి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టాడు.
విరాట్ కోహ్లి 20(18)
రిషబ్ పంత్ 1(1)
హసన్ అలీ 1-0-6-1

సూర్యకుమార్ యాదవ్ అవుట్

హసన్ అలీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ (సి) రిజ్వాన్ (బి) హసన్ అలీ (11: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)

ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 30-2

షహీన్ అఫ్రిది వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టాడు.
విరాట్ కోహ్లి 15(15)
సూర్యకుమార్ యాదవ్ 11(6)
షహీన్ అఫ్రిది 3-0-19-2

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 21-2

ఇమాద్ వసీం వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టాడు.
విరాట్ కోహ్లి 6(9)
సూర్యకుమార్ యాదవ్ 11(6)
ఇమాద్ వసీం 2-0-10-0

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 14-2

షహీన్ అఫ్రిది వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. మొదటి బంతికే రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు. చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ కొట్టి భారత్‌కు తొలి బౌండరీ అందించాడు.
విరాట్ కోహ్లి 2(6)
సూర్యకుమార్ యాదవ్ 7(4)
షహీన్ అఫ్రిది 2-0-10-2

కేఎల్ రాహుల్ అవుట్

షహీన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్‌గా అవుటయ్యాడు.
కేఎల్ రాహుల్ (బి) షహీన్ అఫ్రిది (3: 8 బంతుల్లో)

రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 6-1

ఇమాద్ వసీం వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.
కేఎల్ రాహుల్ 3(7)
విరాట్ కోహ్లి 3(4)
ఇమాద్ వసీం 1-0-4-0

రోహిత్ అవుట్.. మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 2-1

షహీన్ అఫ్రిది వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్ మూడో బంతికి సింగిల్‌తో భారత్ ఖాతా తెరిచింది. నాలుగో బంతికి రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆడిన మొదటిబంతికే రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
కేఎల్ రాహుల్ 1(3)
విరాట్ కోహ్లి 1(2)
షహీన్ అఫ్రిది 1-0-2-1

రోహిత్ శర్మ అవుట్

ఆడిన మొదటి బంతికే రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.


రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) రోహిత్ శర్మ (0)

గేమ్ స్టార్ట్ అయింది

భారత్ తరఫున కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగారు. 21 సంవత్సరాల యువ బౌలర్ షహీన్ అఫ్రిది మొదటి ఓవర్ వేయడానికి సిద్ధం అయ్యాడు.

భారత్ తుదిజట్టు

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా


మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుదిజట్టులో చోటు..

పాకిస్తాన్ తుదిజట్టు

బాబర్ ఆజమ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, షహీప్ అఫ్రిది

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

పాకిస్తాన్ కూడా..



యుద్థానికి సిద్ధం

Background

ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రెండు దేశాల్లో ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ రెండు జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ అంటే రెండు దేశాలూ పూర్తిగా స్తంభించిపోతాయి.  టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్తాన్ ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియాదే విజయం. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టై కాగా.. భారత్ బౌల్ అవుట్‌లో విజయం సాధించింది. అదే కప్ ఫైనల్‌లో కూడా భారత్, పాకిస్తానే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లో ఉండగా.. మిస్బా స్కూప్ షాట్ ఆడటం, ఆ బంతి నేరుగా శ్రీశాంత్ చేతుల్లో పడటం, ఆ తర్వాత కప్ మన చేతికి రావడం ఎవరూ మర్చిపోలేరు.


ప్రస్తుత బలాబలాలను చూస్తే.. రెండు జట్లూ రెండేసి వార్మప్ మ్యాచ్‌లు ఆడాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవగా.. పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఇండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్ సూపర్ ఫాంలో ఉన్నాడు. తనకు తోడుగా ఓపెనింగ్ చేయనున్న రోహిత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక వన్‌డౌన్‌లో రానున్న కెప్టెన్ కింగ్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తన ప్రస్తుతం ఫాం కాస్త ఇబ్బందికరంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా.. ఇలా బ్యాటింగ్ లైనప్ అంతా విధ్వంసకర బ్యాట్స్‌మెనే.


ఇక బౌలింగ్ కూడా బ్యాటింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉంది. బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్.. ఇలా అందరూ ఐపీఎల్‌లో పరుగులు కట్టడి చేయడంతో పాటు.. వికెట్లు కూడా తీసినవారే. అయితే ఆరోజు ఎలా ఆడారు అన్నదానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి.. వీరందరూ తమ 100 శాతం ప్రదర్శనను ఇవ్వాల్సిందే.


భారత్, పాకిస్తాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా... ఈ రెండు జట్లూ ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడటం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.


పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ప్రధానంగా బాబర్ ఆజమ్, ఫకార్ జమాన్, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌ల మీదనే ఆధారపడింది. మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీంలు కూడా ఇటీవలి కాలంలో బాగానే రాణిస్తున్నారు. బౌలర్లలో షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీలు జట్టుకు కీలకంగా మారనున్నారు. పాకిస్తాన్ భారత్‌తో తలపడే మ్యాచ్‌లో ఉండబోయే 12 మంది ఆటగాళ్ల జాబితాను కూడా వెల్లడించింది. వీరిలో ఒకరు బెంచ్‌కి పరిమితం కానున్నారు.


పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీం, మహమ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.