అభిమానులకు శుభవార్త! టీమ్‌ఇండియా జెర్సీ మరోసారి మారనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తుండటంతో ఎంపీఎల్‌ కొత్త జెర్సీ కిట్‌ను అందించనుంది. బీసీసీఐ ఈ విషయాన్ని ట్వీట్‌ చేసింది.


Also Read: కోల్‌కతాకు దాదాపు ప్లేఆఫ్ బెర్తు.. ముంబై ఆశలు గల్లంతు..... రాజస్తాన్‌పై రైడర్స్ భారీ విజయం!


'మనందరం ఎదురు చూస్తున్న తరుణం ఇదే! అక్టోబర్‌ 13న మాతో జాయిన్‌ అవ్వండి. మీరంతా ఆసక్తిగా ఉన్నారా?' అంటూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అక్టోబర్‌ 13న సరికొత్త జెర్సీని ఆవిష్కరిస్తున్నామని ఓ చిత్రాన్ని జత చేసింది. ఈ విషయం ప్రకటించగానే అభిమానులంతా రీ ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు.


Also Read: ఇసుక కాదు..! చెన్నైకి కేఎల్ తుపాను సెగ! 13 ఓవర్లకే లక్ష్యం ఛేదించేసిన కేఎల్‌ రాహుల్‌


ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌ల ముంగిట అన్ని దేశాలు కొత్త జెర్సీలను రూపొందించుకుంటాయి. టీమ్‌ఇండియా సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. 2016 టీ20 ప్రపంచకప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ ముందు కొత్త కిట్‌లతో కోహ్లీసేన బరిలోకి దిగింది. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సమయంలో రూపొందించిన రెట్రో జెర్సీలు ఒకప్పటికి భారత జట్టును ప్రతిబింబించాయి.


Also Read: సన్‌రైజర్స్‌ నవ్వింది! థ్రిల్లర్‌ మ్యాచులో కోహ్లీసేనను ఓడించింది


సాధారణ నీలం రంగు కాకుండా నేవీ బ్లూ రంగును ఉపయోగించడం అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా ఇంగ్లాండ్‌ సైతం నీలిరంగు జెర్సీలతో బరిలోకి దిగడంతో ఆ మ్యాచుకు ఆరెంజ్‌ జెర్సీలను టీమ్‌ఇండియా ఉపయోగించింది. ఆరెంజ్‌, బ్లూ కాంబినేషన్‌లో భారత్‌ ఆ ఒక్క మ్యాచే ఆడింది. గత ప్రపంచకప్‌ సమయంలో రెట్రో జెర్సీ రూపొందించడంతో ఈ సారి కిట్‌ ఎలావుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.


Also Read: ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?


Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి