స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. కాలి గాయం కారణంగా ఆడటం లేదని శుక్రవారం ప్రకటించాడు. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ 4 ఆటగాడిగా ఉన్న నాదల్ నిర్ణయం టెన్నీస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
రఫెల్ నాదల్ ప్రత్యర్థులుగా ఉన్న డొమినిక్ థీమ్, రోజర్ ఫెదరర్ కూడా ఈ కారణంతోనే తప్పుకున్నారు. ఇప్పుడు నాదల్ అదే కారణంతోనే యూఎస్ ఓపెన్, 2021 సీజన్‌లో పాల్గొనట్లేదని ప్రకటించాడు.
రఫెల్ నాదల్ దాదాపు ఏడాది నుంచి ఎడమ పాదం నొప్పితో బాధపడుతున్నాడు. 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన 34 ఏళ్ల నాదల్... ఓవరాల్‌గా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు.
IPL: వచ్చే ఏడాది నుంచి 8 జట్లు కాదు... 10 జట్లు... స్పష్టం చేసిన అరుణ్ ధుమాల్
టోక్యో ఒలింపిక్స్‌తోపాటు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పుకున్నాడు రఫెల్ నాదల్. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో జొకోవిచ్ చేతిలో ఓడిన నాదల్.. విశ్రాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పుడు ప్రకటించాడు. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లో స్వర్ణం సాధించిన రఫెల్.. 2008, 2010లో వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచాడు.
రఫెల్ నాదల్ జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. ఎడమ కాలికి గాయం అయినందున తన సీజన్‌ను ముగించనున్నట్లు తాజాగా ప్రకటించాడు.. యూఎస్ ఓపెన్‌కు దూరమవుతున్నట్టు ట్వీట్ చేశాడు. 'దురదృష్టవశాత్తు నేను 2021 సీజన్‌ను ముగించాల్సి ఉందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఏడాదిగా నా కాలి గాయంతో బాధపడుతున్నాను. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొంత సమయం తీసుకోవాలి.' అని నాదల్ ట్వీట్ చేశాడు.
కాలి గాయం కారణంగా తీవ్రమైన నొప్పిని భరిస్తున్నానని నాదల్ తెలిపాడు. 'సరిగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. అనుకున్న రీతిలో సన్నద్ధత కాలేకపోతున్నాను. ఇదేమీ కొత్త గాయం కాదు. 2005 నుంచి ఉన్నదే. కెరీర్ ఆరంభంలో నా భవిష్యత్ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కానీ, నేను అనుకున్నది సాధించగలిగాను. నేను కచ్చితంగా ఈ గాయం నుంచి బయటపడతాను" అని ట్వీట్ చేశాడు రఫెల్.
అప్పట్లో ఏం చెప్పాడంటే?
'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు, ముఖ్యంగా యూకే, జపాన్‌లో ఉన్న వారికి ప్రత్యేక సందేశం పంపాలని కోరుకుంటున్నాను. ఒలింపిక్ క్రీడలు ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ప్రతీ క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించాలని ఎన్నో కలలు కంటారు. అలాగే ప్రతీ క్రీడాకారుడికి జీవించే హక్కు కూడా ఉంటుంది. నేను నా దేశ జెండాకు గౌరవం తెచ్చే వ్యక్తిగా ఎంతో బాధ్యతగా ఉంటాను” అని ఒలంపిక్స్ లో పాల్గొనని నాదల్ గతంలో ఇలా ప్రకటించాడు.
'హాయ్, వింబుల్డన్‌లో ఈ ఏడాది జరిగే ఛాంపియన్‌షిప్‌లు, టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది ఎప్పటికీ తేలికైన నిర్ణయం కాదు. కానీ, నాశరీరం సహకరించకపోవడంతో నా టీం చర్చించిన తర్వాత ఇది సరైన నిర్ణయం అని నేను అర్థం చేసుకున్నాను.' అని వింబుల్డన్ లో పాల్గొనని ప్రకటించాడు.