చెన్నై సూపర్ కింగ్స్ 6 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుంది. గురువారం టీమంతా ఫస్ట్‌ శిక్షణా కార్యక్రమంలో పాల్గొంది. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌ చెప్పేందుకు ప్రాక్టీస్ సెషన్ ఫొటోలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.


 










డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇవాల్టి నుంచి షేక్ జాయెద్ స్టేడియంలో ప్రాక్టిస్‌ సెషన్‌లో పాల్గొనబోతోంది. 


ALSO READ:చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత


గత ఐపీఎల్‌ రన్నరప్‌ ఢిల్లీ టీం రేపు యూఏఈ చేరుకుంటుంది. భుజం గాయం మొన్న జరిగిన మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌... ఇప్పటికే యూఏఈలో ఉన్నాడు. కోచ్‌తో కలిసి యూఏఈ చేరుకున్నాడు. మిగతా జట్టు సభ్యులు వాళ్ల వాళ్ల ఒప్పందం బట్టి జట్టుతో కలుస్తారు. 


ఏపీఎల్‌ 2021 కోసం ఢిల్లీ జట్టు.. శనివారం తెల్లవారుజామునే యుఏఇ బయలుదేరుతుంది. దేశీయ ఆటగాళ్లు, అధికారులతో ఢిల్లీ నుంచి జట్టు వెళ్లనుంది. ఇప్పటికే అటగాళ్లంతా క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. యూఏఈలో కూడా వారం పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత శిక్షణ శిబిరం స్టార్ట్ అవుతుంది. 


ALSO READ:ట్రిపుల్‌ ఆర్‌ విడుదల వాయిదా? రాజమౌళి పెట్టబోయే ప్రెస్‌మీట్‌ అందుకేనా?


భారత్‌లో ప్రారంభమైన ఏపీఎల్‌ 14వ సీజన్ మ్యాచ్‌లు ఆటగాళ్లకు కరోనా రావడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఈ మ్యాచ్‌లు జరుగుతుండగానే సెకండ్‌ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021ను వాయిదా వేయక తప్పలేదు. కొందరు ప్లేయర్లకు కరోనా రావడంతో బీసీసీఐ అర్థాంతరంగా ఐపీఎల్‌‌ను నిలిపేశారు. భారత్‌లో వీలు పడదని గ్రహించి తగిన జాగ్రత్తలతో యూఏఈలో నిర్వహించడానికి నిర్ణయించారు. ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌లో ఐపీఎల్‌ 14వ సీజన్ మళ్లీ మొదలవుతుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగనుంది. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, బెంగళూరు ఛాలెంజర్స్‌ తలపడనున్నాయి. మొత్తం మీద దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి.


ALSO READ:బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్లే...!


మొన్న జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నా.. ఆటగాళ్లకు వైరస్ సోకింది. అందుకే బీసీసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అటగాళ్లందరికీ ప్రత్యేక హెల్త్‌ బుక్ అందిస్తోంది. 46పేజీలో ఈ బుక్‌లో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించింది. ప్రతి ఒక్క ఐపీఎల్ ఆటగాడు విధిగా పాటించాల్సిన నియమాలను అందులో పొందుపరిచింది. 


ALSO READ: రాఖీకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇవి ట్రై చేయండి


ALSO READ: పాలు ఏ వేళలో తాగితే మంచిది? రాత్రి నిద్రపోవడానికి ముందు తాగొచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?


ALSO READ: మనుషుల కంటే ముందే అంతరిక్షానికి వెళ్లిన ఆ కుక్క, కోతులు ఏమయ్యాయి?