ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్ అయిన క్వింటన్ డికాక్ తండ్రి అయ్యాడు. డికాక్ భార్య సాషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని డికాక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. పాపకు ‘కియారా’ అని పేరు పెట్టారు. 2016లో సాషాను డికాక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
క్వింటన్ డికాక్ ఇటీవలే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను దక్షిణాఫ్రికా విడుదల చేసింది.
క్వింటన్ డికాక్ మొత్తం 54 మ్యాచ్‌లు ఆడాడు. 38.82 సగటుతో 3,300 పరుగులను డికాక్ సాధించాడు. అత్యధిక స్కోరు 141 నాటౌట్ కాగా.. మొత్తంగా ఆరు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు చేశాడు. 221 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు కూడా తన ఖాతాలో ఉన్నాయి.
Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు
Also Read: బుమ్రా, జన్‌సెన్ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్.. టెన్షన్
Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్! సఫారీల లక్ష్యం 240.. టీమ్‌ఇండియా 266 ఆలౌట్
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.