Puneri Paltan crowned champions after dominant win over Haryana Steelers : ప్రో కబడ్డీ లీగ్ 2023-24 (PKL Season 10 )సీజన్‌ విజేతగా పుణెరి పల్టన్‌(Puneri Paltan) నిలిచింది. హైదరాబాద్‌ వేదికగా హర్యానా స్టీలర్స్(Haryana Steelers)తో జరిగిన ఫైనల్లో 28-25 తేడాతో విజయం సాధించిన పుణెరి పల్టన్‌ తొలి సారి ట్రోఫిని ముద్దాడింది. మ్యాచ్ మొదటి నుంచీ హర్యానాపై ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చిన పుణెరి పల్టన్ చివరికి టైటిల్ సొంతం చేసుకుంది. పుణెరి పల్టన్‌ ఛాంపియన్స్‌గా నిలవడంలో ఆ జట్టు రైడర్‌ పంకజ్‌ మోహితే(Pankaj) 9 పాయింట్లతో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు మరో రైడర్‌ మోహిత్‌ గోయత్‌ 5 పాయింట్లు సాధించాడు. ఇక టాకిల్స్‌లో గౌరవ్‌ 4 పాయింట్లతో సత్తాచాటాడు.


 2014లో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌ ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. 2014, 2022 సీజన్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, 2015లో యు ముంబా, 2016, 2017లో పట్నా పైరేట్స్‌, 2018లో బెంగళూరు బుల్స్‌, 2019లో బెంగాల్‌ వారియర్స్‌, 2021లో దబాంగ్‌ దిల్లీ విజేతలుగా నిలిచాయి. ఈసారి ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్‌ విజేతగా పుణెరి పల్టన్‌ నిలిచింది.ఈసారి బరిలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగాయి. తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌, పుణెరి పల్టాన్‌, పట్నా పైరేట్స్‌, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, హరియాణా స్టీలర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, దబాంగ్‌ దిల్లీ, బెంగళూరు బుల్స్‌, బెంగాల్‌ వారియర్స్‌, యూపీ యోధ, యు ముంబా కప్పు వేటలో పడినా పుణేరి టైటిల్‌ ఒడిసి పట్టింది. 


కూత పెట్టిన దేశం
గత 9 సీజన్‌‌లుగా కబడ్డీ అభిమానులు అలరిస్తోన్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 కూడా బాగా ఆకట్టుకుంది. తొమ్మిదేళ్లుగా అశేష అభిమానులను అలరించిన ఈ లీగ్‌ పదో సీజన్‌లోనూ అలరించింది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్రీడకు ప్రాముఖ్యత పెరిగింది. భారీ ప్రజాదరణ లభించింది. దేశంలోని క్రీడాభిమానులను సుపరిచితం అయిన కబడ్డీ.. ప్రో కబడ్డీ లీగ్‌తో దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను ఆకర్షించింది. ఈ క్రమంలో పది వసంతాలు పూర్తి చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్‌-గుజరాత్‌ జెయింట్స్‌తో తలపడ్డాయి.  జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్, పదో సీజన్ తొలి మ్యాచ్‌లో పోటీ పడే కెప్టెన్లు పవన్ సెహ్రావత్ (తెలుగు టైటాన్స్), ఫజెల్ అత్రాచలి (గుజరాత్ జెయింట్స్)తో కలిసి ప్రారంభించారు. 


పురాతన ఆట కబడ్డీకి, భారత ప్రజలకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి బలమైన అనుబంధం ఉంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్రీడకు ప్రాముఖ్యత పెరిగింది. భారీ ప్రజాదరణ లభించింది. లీగ్‌ రూపకర్త మాషల్‌ స్పోర్ట్స్‌ 30-సెకన్ల రైడ్స్‌, డూ-ఆర్‌-డై రైడ్స్‌, సూపర్‌ రైడ్స్‌, సూపర్‌ ట్యాకిల్స్‌ వంటి వినూత్న నియమాలను అమలు చేసి ఈ ఆటకు కొత్త ఊపు తీసుకొచ్చింది. దేశంలోని క్రీడాభిమానులను సుపరిచితం అయిన ఆటను లీగ్‌ ప్రసారకర్తలు ప్రో కబడ్డీ లీగ్‌లో అద్భుతంగా చూపెట్టి దేశ, విదేశాల్లో కోట్లాది మందిని ఆకర్షించారు.