WTC Final Aus VS SA | నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్

నేటి నుంచి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. ఇప్ప‌టివ‌రకు రెండుసార్లు ఈ ఫైన‌ల్ జ‌ర‌గ‌గా, తొలిసారి న్యూజిలాండ్, మరోసారి ఆసీస్ విజేత‌గా నిలిచాయి. దీంతో ఈ ఫైన‌ల్లో ఆసీస్ డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగుతోంది. ఇక ఈ రెండు టీమ్స్ తమ తుదిజ‌ట్టును ప్రకటించాయి. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్ చేతిలో ఓడిపోయి త్రుటిలో టైటిల్ కోల్పోయిన స‌ఫారీలు.. ఈసారి మాత్రం అలాంటి త‌ప్పు చేయ‌కూడద‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. 

ఈసారి బ‌ల‌మైన జ‌ట్టుతోనే సౌతాఫ్రికా బ‌రిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా  ర్యాన్ రికెల్ట‌న్, డేవిడ్ బెడింగ్ హామ్ బ‌రిలో ఉన్నారు. ఆల్ రౌండ‌ర్లుగా వియాన్ మ‌డ్ల‌ర్, మార్కో య‌న్సెన్ బ‌రిలోకి దిగుతారు. పేస‌ర్లుగా క‌గిసో ర‌బాడ‌, లుంగీ ఎంగిడి ఆడ‌నుండ‌గా, ఏకైక స్పిన్న‌ర్ గా కేశ‌వ్ మ‌హారాజ్ బ‌రిలోకి దిగుతాడు. లార్డ్స్ మైదానం పేస‌ర్ల‌కు అనుకూలిస్తుండ‌టంతో ఇరుజ‌ట్లు బలంగానే  క‌నిపిస్తున్నాయి. స్పిన్ కు స‌మ‌ర్థ‌మైన బ్యాటింగ్ లైన‌ప్ ఆసీస్ సొంతం. అలాగే ఇప్ప‌టికే ఒక డ‌బ్యూటీసీ ఫైన‌ల్ ఆడ‌టం, అందులో గెల‌వ‌డంతో ఆస్ట్రేలియా గట్టిపోటీని ఇవ్వడానికి బ‌రిలోకి దిగుతోంది. చూడాలి మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఎవరి సొంతం అవుతుందో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola