AUS Vs SA WTC Final 2025: దక్షిణాఫ్రికా జట్టు 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను అద్భుతంగా ప్రారంభించింది. లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో బుధవారం, జూన్ 11న ఫైనల్ మ్యాచ్‌లో ఉదయం సెషన్‌లోనే ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాటర్లు ఔటయ్యారు. సఫారీ పేసర్లు మార్కో జాన్సన్, కగిసో రబాడ బంతులకు ఆసీస్ బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా తొలి సెషన్లోనే నలుగురు స్టార్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆస్ట్రేలియా ప్రస్తుతం లంచ్ సమయానికి 67/4 స్కోరుతో ఉంది. లంచ్ అనంతరం మొదటి రోజు ఆట కొనసాగుతోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్లు ఆస్ట్రేలియా టాపార్డర్ ను సఫారీ పేసర్లు ఓ ఆటాడుకున్నారు. మొదట ఉస్మాన్ ఖవాజా (0) డకౌట్ అయ్యాడు. 20 బంతులాడిన ఖవాజా సఫారీ పేసర్ రబాడ బౌలింగ్ లో ఔటయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (4)ను సైతం రబాడ పెవిలియన్ బాట పట్టించాడు.
మార్నస్ లాబుషేన్ (17), స్టీవ్ స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ మార్కో జాన్సన్ బౌలింగ్ లో లబుషేన్ ఆడిన బంతిని కీపర్ వీరిన్నే అదుకోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికాకు తలనొప్పిగా మారతాడనుకున్న ట్రావిస్ హెడ్ (11) ను సైతం జాన్సన్ ఔట్ చేశాడు. హెడ్ ఆడిన బంతిని కీపర్ క్యాచ్ అందుకోవడంతో ఆసీస్ 4వ వికెట్ సైతం కోల్పోయింది. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 23.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ (37), వెబ్‌స్టర్ (0) ఉన్నారు.
ఇక్కడ అవుట్‌ల వివరాలు ఉన్నాయి: