భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. వికెట్ నష్టపోకుండా 129 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కాసేపు సాఫీగానే సాగింది. మొదటి వికెట్‌కు 151 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ విల్ యంగ్‌ను (89: 214 బంతుల్లో, 15 ఫోర్లు) అవుట్ చేసి అశ్విన్ భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు.


ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ భారత స్పిన్నర్లను తట్టుకుని నిలబడలేకపోయారు. మరో ఓపెనర్ టామ్ లాథమ్ (95: 282 బంతుల్లో, 10 ఫోర్లు) సెంచరీ ముంగిట అవుటయ్యారు. వీరి తర్వాత పేస్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్‌దే (23: 75 బంతుల్లో, ఒక ఫోర్) అత్యధిక స్కోరు.


వన్ డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ (18: 64 బంతుల్లో, రెండు ఫోర్లు), తర్వాత వచ్చిన రాస్ టేలర్ (11: 28 బంతుల్లో, ఒక ఫోర్) కూడా త్వరగా అవుటయ్యారు. కేన్ విలియమ్సన్ వికెట్ ఉమేష్ యాదవ్‌కు దక్కగా, రాస్ టేలర్‌ను అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రను (13: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు.


పిచ్ స్పిన్‌కు సహకరించడంతో అశ్విన్, జడేజా, అక్షర్ చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ ఐదు వికెట్ల ఫీట్ అందుకోగా.. అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. జడేజా, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీశారు.


అంతకుముందు టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ సాధించడంతో పాటు రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) అర్థ సెంచరీ సాధించాడు.


Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!


Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?


Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!


Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌


Also Read: Ind vs NZ, 1st Test Match Highlights: ఇదేంది సామీ..! ఒక్క వికెట్టైనా తీయలేదు.. కివీస్‌ 129/0


Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?


Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ అతిపెద్ద క్రాష్‌..! భయం గుప్పిట్లో క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి