టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అందులో ఎంతో మంది అతడిని చూడటం కోసం తపించిపోతారు! అతడిని కలుసుకొనేందుకు ఆరాటపడతారు. కొందరు వీరాభిమానులైతే సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేసి అతడితో సెల్ఫీ దిగుతుంటారు. అలాంటి కోవకే చెందుతాడు హరియాణాకు చెందిన అజయ్‌ గిల్‌.


ఎంఎస్‌ ధోనీ ఆశీర్వాదాలు తీసుకొనేందుకు అజయ్‌ గిల్‌ ఏకంగా 1,436 కిలోమీటర్లు నడుచుకుంటూ రాంచీకి వచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం ఇంటర్నెట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరో విశేషం ఏంటంటే గిల్‌ ఇలా నడిచిరావడం ఇది రెండోసారి. మొదటి సారి రావడానికి 16 రోజుల సమయం తీసుకున్న గిల్‌ రెండోసారి 18 రోజుల్లో యాత్రను పూర్తి చేశాడు.


మహీ సైతం గిల్‌కు సాదరంగా స్వాగతం తెలిపాడని తెలిసింది. వ్యవసాయ క్షేత్రంలో అతడికి విడిది ఏర్పాటు చేసి భోజనం పెట్టించాడు. అతడితో పాటు సెల్ఫీ దిగాడు. ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడట. హరియాణాకు తిరిగి వెళ్లేందుకు విమానం టికెట్లు కూడా బుక్‌ చేశాడట. కాగా టీమ్‌ఇండియా ఆడాలన్నది గిల్‌ కలగా తెలిసింది. పట్టణ జట్టుకు ఆడిన అతడు కొన్నాళ్లు క్రికెట్‌ మానేశాడు. తిరిగి క్రికెట్‌ మొదలు పెట్టేందుకు మహీ ఆశీర్వాదం తీసుకోవాలని రాంచీకి వచ్చాడట!


Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!


Also Read: IND vs NZ: బ్యాటర్‌ను బోల్తా కొట్టించడం బౌల్ట్‌కు నేనే నేర్పించా..! నా బలహీనత అతడికి తెలుసన్న రోహిత్ శర్మ


Also Read: Rachin Ravindra: రాహుల్‌ ద్రవిడ్‌లో 'ర'.. సచిన్‌లో 'చిన్‌' కలిస్తే 'రచిన్‌ రవీంద్ర'.. కివీస్‌లో భారత క్రికెటర్‌


Also Read: Ricky Ponting Update: ఐపీఎల్‌ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్‌ ఆఫర్‌.. ఎందుకు తిరస్కరించాడంటే?


Also Read: Ind vs NZ 2nd T20I: రెండో టీ20 వాయిదా పడుతుందా? ఏకంగా హైకోర్టులో!


Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్‌.. పేటీఎం ఫౌండర్‌ విజయ గాథ ఇది!


Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!


Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి