భారత్, న్యూజిలాండ్ మొదటి టీ20లో ఒక ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడే కివీస్ యువ క్రికెటర్ 'రచిన్ రవీంద్ర'. భారత సంతతి వ్యక్తే కావడంతో భారతీయులు అతడి గురించి తెలుసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ పేర్లు కలిసేలా అతడు పేరు పెట్టుకోవడం గమనార్హం.
న్యూజిలాండ్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటున్నాడు రచిన్ రవీంద్ర. 2016, 2018లో కివీస్ తరఫున అండర్ 19 ప్రపంచకప్‌లు ఆడాడు. 2018-19లో సీజన్లో వెల్లింగ్టన్ తరఫున ఆడాడు. అదే సీజన్లో లిస్ట్-ఏ క్రికెట్లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. ఫోర్డ్ ట్రోఫీలో లిస్ట్-ఏలో తొలి శతకం అందుకున్నాడు. ప్లంకెట్ షీల్డ్‌లో ఫస్ట్‌క్లాస్ శతకం అందుకున్నాడు.
2020, నవంబర్‌లో న్యూజిలాండ్-ఏ తరఫున వెస్టిండీస్ పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడాడు. జూన్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ జట్టులోనూ ఉన్నాడు. 2021, సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు టెస్టులు సిరీసులో అరంగేట్రం చేశాడు. బుధవారం టీమ్‌ఇండియాతో మ్యాచులోనూ ఆడాడు.
రచిన్ తల్లిదండ్రులు రవి కృష్ణమూర్తి, దీపా కృష్ణమూర్తి. తండ్రి రవి సిస్టమ్ ఆర్కిటెక్ట్. బెంగళూరులో ఉండేవారు. 1990లో న్యూజిలాండ్‌లో హట్‌హాక్స్ క్లబ్‌ను స్థాపించి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి అతడికీ క్రికెట్ అంటే ఇష్టం. బెంగళూరు జట్టులో ఆడుతుండేవాడు. కాగా రచిన్ నాలుగేళ్లుగా ఆంధ్రాలోని అనంతపురంలోనే క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రతి శీతాకాలం ఇక్కడి వచ్చి నాలుగు నెలలు ఉంటాడు.
Also Read: Rohit Sharma on Kohli: విరాట్ గురించి రోహిత్ బిగ్ స్టేట్‌మెంట్.. ఏం చెప్పాడో తెలుసా?
Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి