భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీలో జరగనున్న రెండో టీ20లో ఈ రెండు జట్లూ తలపడాల్సి ఉంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం.. భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరగనున్న రెండో టీ20ని వాయిదా వేయాలని లేదా మొత్తం స్టేడియం సామర్థ్యం సగం మందిని మాత్రమే లోనికి అనుమతించాలని జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది.
జార్ఖండ్ హైకోర్టు అడ్వొకేట్ ధీరజ్ కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిని ఇచ్చారు. కరోనావైరస్ కారణంగా గుడులు, కోర్టులు, రాష్ట్రంలోని ఎన్నో ఆఫీసులు 50 శాతం స్టాఫ్‌తోనే పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్‌కు మాత్రం ఎందుకు పూర్తి ఆక్యుపెన్సీకి అనుమతిని ఇచ్చిందని పిల్‌లో ప్రశ్నించారు.
ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే డేరిల్ మిషెల్‌ను(0: 1 బంతి) అవుట్ చేసి భువనేశ్వర్ కుమార్ టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మార్క్ చాప్‌మన్ (63: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (70: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఆ ప్రభావం తమ మీద పడకుండా ఆడారు.
తర్వాత 14వ ఓవర్లో అశ్విన్ భారత్‌కు మళ్లీ మంచి బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్‌లను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడలేకపోవడంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. కేఎల్ రాహుల్ (15: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (48: 35 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాహుల్ అవుటైనా సూర్యకుమార్ యాదవ్ (62: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), రోహిత్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం ట్రెంట్ బౌల్ట్.. కెప్టెన్ రోహిత్‌ను అవుట్ చేసి న్యూజిలాండ్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు.చివర్లో రిషబ్ పంత్ (17 నాటౌట్: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) కొంచెం బాగా ఆడటంతో భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read: Rohit Sharma on Kohli: విరాట్ గురించి రోహిత్ బిగ్ స్టేట్‌మెంట్.. ఏం చెప్పాడో తెలుసా?
Also Read: ICC Mens Cricket Committee: ఐసీసీలో దాదాగిరి! మరో కీలక పదవికి ఎంపికైన గంగూలీ
Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి