సంక్రాంతి బరిలో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం', 'భీమ్లా నాయక్', 'రాధే శ్యామ్' సినిమాలు విడుదల అవుతున్నాయి. ఏ సినిమా ఉంటుంది? ఏ సినిమా వాయిదా పడుతుంది? అనే వార్తలు పక్కన పెడితే... అసలు, ఈ పోటీకి సంబంధం లేకుండా ముందుగా ఫిబ్రవరికి వెళ్లింది 'ఆచార్య' సినిమా. అయితే... ఆ సినిమాకు కూడా పోటీ తప్పడం లేదు.





సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా 'ఎత్తారుక్కుమ్ తునింధవన్'ను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా టీజర్ కూడా విడుదల చేశారు. అందులో సూర్య మాస్ డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు ఓటీటీ వేదికల్లో విడుదల అయ్యాయి. 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' థియేటర్లలో విడుదలై ఉంటే మంచి కలెక్షన్స్ వచ్చేవని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫీలింగ్. ఇప్పుడు సూర్య సినిమా థియేటర్లకు వస్తోంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే... థియేటర్లు అన్నీ ఆయనకు వస్తాయని గ్యారెంటీ లేదు. ఎందుకంటే... ఆ రోజు థియేటర్ల దగ్గర చిరంజీవి సినిమా వస్తోంది.





తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. అందువల్ల, థియేటర్ల దగ్గర మెగా మూవీ, సూర్య మూవీ మధ్య కొంత పోటీ తప్పదు. 

Also Read: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్
Also Read: చట్టాలు రోడ్లపైకొచ్చిన జనం రూపొందిస్తుంటే.. మనది కూడా జిహాదీ దేశమే, కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read: 'జై విఠ‌లాచార్య'... జానపద బ్రహ్మపై పుస్తకం ఫస్ట్ లుక్ విడుదల చేసిన కృష్ణ
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి