టీమిండియా పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌-10లోకి ప్రవేశించాడు. ఓవల్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత స్పెల్‌తో ఇంగ్లండ్‌ వెన్నువిరిచిన బుమ్రా.. 771 రేటింగ్‌ పాయింట్లతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ - 10లోకి దూసుకొచ్చాడు. 771 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.


Also Read: Ind vs Eng, 5th Test: యథావిధిగా 5వ టెస్టు... షమి అందుబాటులో... రోహిత్ శర్మ, పుజారా అనుమానం?


ఈ జాబితాలో ఆసీస్‌బౌలర్ కమిన్స్‌(908) నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(831), న్యూజిలాండ్‌ టిమ్‌ సౌథీ(824) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 






ఇక బ్యాటింగ్ విషయానికొస్తే... ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ సారధి జో రూట్‌(903) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్‌ విలియమ్సన్‌(901), ఆసీస్‌ స్టీవ్‌ స్మిత్‌(891) రెండు, మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో సూపర్‌ శతకంతో చెలరేగిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(813).. తన రేటింగ్‌ పాయింట్లను భారీగా పెంచుకుని ఐదో స్థానంలోనే ఉన్నాడు.


Also Read: Ind vs Eng, 5th Test: గుడ్ న్యూస్.. యథాతథంగా 5వ టెస్ట్ మ్యాచ్, అందరికీ కొవిడ్ నెగటివ్


ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(783) ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఓవల్‌ టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన శార్దూల్‌ ఠాకూర్‌.. రెండు విభాగాల్లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని టాప్‌-10 దిశగా దూసుకొస్తున్నాడు. బ్యాటింగ్‌లో 79, బౌలింగ్‌లో 49వ ర్యాంకుకు ఎగబాకాడు.


Also Read: Sourav Ganguly Biopic Announced: ప్రిన్స్ గంగూలీ పై బయోపిక్...నిర్మించ‌నున్న ల‌వ్ ఫిల్మ్స్‌... గంగూలీ పాత్రలో హృతిక్‌రోషన్‌ నటిస్తాడా?


ఇంగ్లాండ్  x భారత్ మధ్య చివరి టెస్టు శుక్రవారం ప్రారంభంకానుంది. ఇప్పటికే రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత్ 2-1ఆధిక్యంలో ఉంది. ఇక చివరి టెస్టులో భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. డ్రా చేసుకుంటే 2-1తో, ఓడితే 2-2తో భారత్ సిరీస్ ముగిస్తుంది. మరి, ఏం జరుగుతుందో చూడాలి. 


Also Read: ICC T20 World Cup: ధోనీ నియామకంపై వివాదం... టీ20 ప్రపంచకప్ జట్టుకు మెంటార్‌గా ధోనీని ప్రకటించిన జై షా... వివరణ ఇచ్చిన గంగూలీ