RCB vs CSK Live Updates: 18.1 ఓవర్లలో చెన్నై స్కోరు 157-4, ఆరు వికెట్లతో చెన్నై విజయం
IPL 2021, Royal Challengers Bangalore vs Chennai Super Kings: బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది.
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్ మొదటి బంతికే మ్యాచ్ ముగిసింది. 18.1 ఓవర్లలో 157-4 స్కోరు సాధించి చెన్నై ఆరు వికెట్లతో విజయం సాధించింది.
రైనా 17(10)
ధోని 11(9)
హర్షల్ పటేల్ 3.1-0-25-2
సిరాజ్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 10 పరుగులు సాధించారు. 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 155-4గా ఉంది. చెన్నై లక్ష్యం 12 బంతుల్లో 2 పరుగులు.
రైనా 16(9)
ధోని 11(9)
సిరాజ్ 3-0-23-0
హసరంగ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 11 పరుగులు సాధించారు. రాయుడు అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 145-4గా ఉంది. చెన్నై లక్ష్యం 18 బంతుల్లో 12 పరుగులు.
రైనా 15(8)
ధోని 2(4)
హసరంగ 4-0-40-0
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ తొమ్మిది పరుగులు సాధించారు. రాయుడు అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 134-4గా ఉంది. చెన్నై లక్ష్యం 24 బంతుల్లో 23 పరుగులు.
రైనా 5(4)
ధోని 1(2)
హర్షల్ పటేల్ 3-0-23-2
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాయుడు.. డివిలియర్స్ చేతికి చిక్కాడు.
అంబటి రాయుడు (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ (32: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)
చాహల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఏడు పరుగులు మాత్రమే చేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 125-3గా ఉంది. చెన్నై లక్ష్యం 30 బంతుల్లో 32 పరుగులు.
రైనా 5(4)
అంబటి రాయుడు 24(18)
చాహల్ 4-0-26-1
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఆరు పరుగులు మాత్రమే చేసి మొయిన్ అలీ వికెట్‌ను కోల్పోయారు. 14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 118-3గా ఉంది. చెన్నై లక్ష్యం 36 బంతుల్లో 39 పరుగులు.
రైనా 0(0)
అంబటి రాయుడు 22(16)
హర్షల్ పటేల్ 2-0-14-1
మొయిన్ అలీ (సి) కోహ్లీ (బి) హర్షల్ (23: 18 బంతుల్లో, 2 సిక్సర్లు)
హసరంగ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 12 పరుగులు చేశారు. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 112-2గా ఉంది. చెన్నై లక్ష్యం 42 బంతుల్లో 45 పరుగులు.
మొయిన్ అలీ 21(15)
అంబటి రాయుడు 19(12)
హసరంగ 3-0-29-1
మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 10 పరుగులు చేశారు. 12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 100-2గా ఉంది. చెన్నై లక్ష్యం 48 బంతుల్లో 57 పరుగులు.
మొయిన్ అలీ 11(11)
అంబటి రాయుడు 17(10)
మ్యాక్స్‌వెల్ 2-0-17-1
చాహల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 12 పరుగులు చేశారు.11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 90-1గా ఉంది. చెన్నై లక్ష్యం 54 బంతుల్లో 67 పరుగులు.
మొయిన్ అలీ 9(8)
అంబటి రాయుడు 9(7)
చాహల్ 3-0-19-1
మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఏడు పరుగులు మాత్రమే చేశారు. డుఫ్లెసిస్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 78-1గా ఉంది. చెన్నై లక్ష్యం 60 బంతుల్లో 79 పరుగులు.
మొయిన్ అలీ 1(5)
అంబటి రాయుడు 6(4)
మ్యాక్స్‌వెల్ 1-0-7-1
గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌కు వచ్చిన మొదటి బంతికే డుఫ్లెసిస్‌ను అవుట్ చేశాడు.
ఫాఫ్ డుఫ్లెసిస్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) మ్యాక్స్‌వెల్ (31: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)
చాహల్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు మాత్రమే చేశారు. గైక్వాడ్ అవుటయ్యాడు 9 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 71-1గా ఉంది. చెన్నై లక్ష్యం బంతుల్లో 91 పరుగులు.
మొయిన్ అలీ 0(4)
ఫాఫ్ డుఫ్లెసిస్ 31(25)
చాహల్ 2-0-7-1
చాహల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు.
రుతురాజ్ గైక్వాడ్ (సి) విరాట్ కోహ్లీ (బి) చాహల్ (38: 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్)
హసరంగ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు మాత్రమే చేశారు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 67-0గా ఉంది. చెన్నై లక్ష్యం 78 బంతుల్లో 95 పరుగులు.
రుతురాజ్ గైక్వాడ్ 34(24)
ఫాఫ్ డుఫ్లెసిస్ 31(25)
హసరంగ 2-0-17-0
పవర్ ప్లే అయిపోయాక చాహల్ చేతికి కోహ్లి బంతిని అందించాడు. ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ మూడు పరుగులు మాత్రమే చేశారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 62-0గా ఉంది. చెన్నై లక్ష్యం 78 బంతుల్లో 95 పరుగులు.
రుతురాజ్ గైక్వాడ్ 30(20)
ఫాఫ్ డుఫ్లెసిస్ 30(23)
యజ్వేంద్ర చాహల్ 1-0-3-0
నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఏకంగా 16 పరుగులు చేశారు. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 59-0గా ఉంది. చెన్నై లక్ష్యం 84 బంతుల్లో 98 పరుగులు.
రుతురాజ్ గైక్వాడ్ 28(15)
ఫాఫ్ డుఫ్లెసిస్ 29(22)
నవ్‌దీప్ సైనీ 2-0-25-0
పర్పుల్ కాప్ హోల్డర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 8 పరుగులు చేశారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 43-0గా ఉంది. చెన్నై లక్ష్యం 90 బంతుల్లో 114 పరుగులు.
రుతురాజ్ గైక్వాడ్ 27(14)
ఫాఫ్ డుఫ్లెసిస్ 14(17)
హర్షల్ పటేల్ 1-0-8-0
శ్రీలంక స్పిన్నర్ హసరంగ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 12 పరుగులు చేశారు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 35-0గా ఉంది. చెన్నై లక్ష్యం 96 బంతుల్లో 122 పరుగులు.
రుతురాజ్ గైక్వాడ్ 22(11)
ఫాఫ్ డుఫ్లెసిస్ 12(13)
హసరంగ 1-0-12-0
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు చేశారు. మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 23-0గా ఉంది. చెన్నై లక్ష్యం 102 బంతుల్లో 134 పరుగులు.
రుతురాజ్ గైక్వాడ్ 11(7)
ఫాఫ్ డుఫ్లెసిస్ 11(11)
మహ్మద్ సిరాజ్ 2-0-13-0
నవ్‌దీప్ సైనీ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 10 పరుగులు చేశారు. రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 18-0గా ఉంది. చెన్నై లక్ష్యం 108 బంతుల్లో 139 పరుగులు.
రుతురాజ్ గైక్వాడ్ 7(4)
ఫాఫ్ డుఫ్లెసిస్ 10(8)
నవ్‌దీప్ సైనీ 1-0-8-0
మహ్మద్ సిరాజ్ బెంగళూరు తరఫున మొదటి ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మెన్ 8 పరుగులు చేశారు. మొదటి ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 8-0గా ఉంది. చెన్నై లక్ష్యం 114 బంతుల్లో 149 పరుగులుగా ఉంది.
రుతురాజ్ గైక్వాడ్ 6(3)
ఫాఫ్ డుఫ్లెసిస్ 2(3)
మహ్మద్ సిరాజ్ 1-0-8-0
డ్వేన్ బ్రేవో వేసిన చివరి ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు మాత్రమే చేశారు. 20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 156-6గా ఉంది. ఈ ఓవర్లో మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్ అవుటయ్యారు. చెన్నై లక్ష్యం 120 బంతుల్లో 157 పరుగులుగా ఉంది.
వనిందు హసరంగ 1(1)
డ్వేన్ బ్రేవో 4-0-24-3
బ్రేవో బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) జడేజా (బి) బ్రేవో (11: 9 బంతుల్లో, ఒక సిక్సర్)
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు మాత్రమే చేశారు. 19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 154-4గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 11(7)
హర్షల్ పటేల్ 2(2)
దీపక్ చాహర్ 4-0-35-1
సింగపూర్ క్రికెటర్ టిమ్ డేవిడ్.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
టిమ్ డేవిడ్ (సి)రైనా (బి) చాహర్ 1(3 బంతుల్లో)
డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 10 పరుగులు రాబట్టారు. 18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 150-3గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9(5)
టిమ్ డేవిడ్ 1(1)
డ్వేన్ బ్రేవో 3-0-29-2
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ తొమ్మిది పరుగులు రాబట్టారు. డివిలియర్స్, పడిక్కల్ ఈ ఓవర్లో అవుటయ్యారు. 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 140-3గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 0(0)
శార్దూల్ ఠాకూర్ 4-0-29-2
దేవ్‌దత్ పడిక్కల్ (సి) రాయుడు (బి) శార్దూల్ (70: 50 బంతుల్లో, 5 ఫోర్లు, మూడు సిక్సర్లు)
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి డివిలియర్స్ అవుటయ్యాడు.
ఏబీ డివిలియర్స్ (సి)రైనా (బి) శార్దూల్ 12(11: ఒక సిక్సర్)
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 13 పరుగులు రాబట్టారు. 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 131-1గా ఉంది.
ఏబీ డివిలియర్స్ 6(8)
దేవ్‌దత్ పడిక్కల్ 67(47)
జోష్ హజిల్‌వుడ్ 4-0-34-0
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ నాలుగు పరుగులు మాత్రమే రాబట్టారు. 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 118-1గా ఉంది.
ఏబీ డివిలియర్స్ 4(6)
దేవ్‌దత్ పడిక్కల్ 57(43)
శార్దూల్ ఠాకూర్ 3-0-20-0
డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 3 పరుగులు మాత్రమే రాబట్టారు. 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 114-1గా ఉంది. విరాట్ కోహ్లీ ఈ ఓవర్లో అవుటయ్యాడు.
ఏబీ డివిలియర్స్ 2(2)
దేవ్‌దత్ పడిక్కల్ 56(41)
డ్వేన్ బ్రేవో 2-0-12-1
మొదటి వికెట్‌కు 111 పరుగులు జోడించిన అనంతరం డ్వేన్ బ్రేవో బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు.
విరాట్ కోహ్లీ (సి) రవీంద్ర జడేజా(బి) డ్వేన్ బ్రేవో (53: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)
రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏడు పరుగులు రాబట్టారు. 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 111-0గా ఉంది.
విరాట్ కోహ్లీ 53(39)
దేవ్‌దత్ పడిక్కల్ 55(39)
రవీంద్ర జడేజా 4-0-31-0
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 8 పరుగులు రాబట్టారు. 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 104-0గా ఉంది.
విరాట్ కోహ్లీ 47(35)
దేవ్‌దత్ పడిక్కల్ 54(37)
దీపక్ చాహర్ 3-0-31-0
జడేజా రంగంలోకి దిగాడు. ఈ ఓవర్లో 6 పరుగులే ఇచ్చాడు. పడిక్కల్ (48), విరాట్ (45) అర్ధశతకాలకు చేరువలో ఉన్నారు.
వికెట్ తీసేందుకు సీఎస్‌కే విపరీతంగా శ్రమిస్తోంది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌కు వచ్చాడు. పడిక్కల్ (43) దూకుడు పెంచాడు. మూడో బంతిని బౌండరీకి పంపించాడు. కోహ్లీ (44) ఆచితూచి ఆడాడు. ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
జడేజా 12 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని దేవదత్ పడిక్కల్ (38) ముందుకు దూకి కళ్లు చెదిరే సిక్సర్‌గా బాదేశాడు. కోహ్లీ (42) అర్ధశతకానికి చేరువయ్యాడు.
విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను ధోనీ బౌలింగ్‌కు దించాడు. ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. మూడో బంతిని విరాట్ కోహ్లీ (40) అద్భుతమైన బౌండరీగా మలిచాడు. మరోవైపు పడిక్కల్ (28) నిలకడగా ఆడుతున్నాడు.
జడేజా బౌలింగ్‌కు వచ్చాడు. 6 పరుగులు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ (34) సింగిల్ తీశాడు. రెండో బంతిని పడిక్కల్ (26) బౌండరీకి పంపించాడు.
హేజిల్‌వుడ్ బౌలింగ్‌కు వచ్చాడు. 9 పరుగులు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ (33) సమయోచితంగా ఆడాడు. మూడో బంతిని బౌండరీకి పంపించాడు. పడిక్కల్ (21) అతడికి అండగా ఉన్నాడు.
శార్దూల్ ఠాకూర్‌ను ధోని బౌలింగ్‌కు దించాడు. ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 10 పరుగులు రాబట్టారు. ఐదో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 46-0గా ఉంది.
విరాట్ కోహ్లీ 27(17)
దేవ్‌దత్ పడిక్కల్ 19(13)
శార్దూల్ ఠాకూర్ 1-0-10-0
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 8 పరుగులు రాబట్టారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 36-0గా ఉంది.
విరాట్ కోహ్లీ 19(13)
దేవ్‌దత్ పడిక్కల్ 17(11)
జోష్ హజిల్‌వుడ్ 2-0-13-0
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 10 పరుగులు రాబట్టారు. మూడో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 28-0గా ఉంది.
విరాట్ కోహ్లీ 18(11)
దేవ్‌దత్ పడిక్కల్ 10(7)
దీపక్ చాహర్ 2-0-23-0
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఐదు పరుగులు రాబట్టారు. రెండో ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 18-0గా ఉంది.
విరాట్ కోహ్లీ 13(8)
దేవ్‌దత్ పడిక్కల్ 5(4)
జోష్ హజిల్‌వుడ్ 1-0-5-0
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ 13 పరుగులు రాబట్టారు. మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 13-0గా ఉంది.
విరాట్ కోహ్లీ 9(3)
దేవ్‌దత్ పడిక్కల్ 4(3)
దీపక్ చాహర్ 1-0-13-0
బెంగళూరు తరఫున దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు వచ్చారు. చెన్నై బౌలర్ దీపక్ చాహర్ మొదటి ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యారు.
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వనిందు హసరంగ, నవ్‌దీప్ సైనీ, టిమ్ డేవిడ్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చాహల్
ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్‌వుడ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
షార్జాలో ఇసుక తుపాను కారణంగా టాస్ నిమిషాలు ఆలస్యం అయింది.
Background
ఐపీఎల్‌లో నేడు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ , కోహ్లీ సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబై ఇండియన్స్‌పై విజయంతో చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉండగా, కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం పాలైన బెంగళూరు ఒత్తిడిలో ఉంది. చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిస్తే మళ్లీ టేబుల్ టాప్‌కు వెళ్లనుంది.
చెన్నై ఇప్పటికే సమతూకంగా కనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. తనకు టాప్ ఆర్డర్‌లో ఒక్కరు సహకారం అందించినా.. చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయం. ఫాఫ్ డుఫ్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ధోని, రవీంద్ర జడేజా.. ఇలా టీం నిండా హిట్టర్లే ఉన్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లకు కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. బౌలింగ్‌లో కూడా చెన్నై బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేస్తూనే ఉన్నారు. మధ్య ఓవర్లలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ప్రభావం చూపిస్తున్నారు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శామ్ కరన్‌లు మొదటి, చివరి ఓవర్లలో ఆ బాధ్యత తీసుకుంటున్నారు.
దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్.. పేపర్ మీద చూడటానికి పేర్లు భయంకరంగా ఉన్నా.. దేవ్‌దత్ పడిక్కల్ మినహా మిగతా ముగ్గురూ విఫలం కావడం జట్టుపై గత మ్యాచ్‌లో తీవ్రప్రభావం చూపింది. ఇక బౌలింగ్‌లో హర్షల్ పటేల్, కైల్ జేమీసన్, చాహల్, సిరాజ్ ఉన్నారు. హర్షల్ పటేల్ వికెట్లు తీస్తున్నా.. పరుగులు ఆపలేకపోతున్నాడు. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వేసిన ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా 37 పరుగులు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
- - - - - - - - - Advertisement - - - - - - - - -