How To Keep Credit Card Safe: ఈ రోజుల్లో సైబర్ నేరాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకరిని డిజిటల్‌గా అరెస్టు చేయడం, ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం, అతని ఖాతా నుంmr డబ్బు దొంగిలించడం వంటి కేసులు ప్రతిరోజూ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఒక చిన్న పొరపాటు కూడా మీ జేబుకు భారీగా చిల్లు పడుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు సైబర్ నేరగాళ్లకు క్షణాల్లో చేరుతుంది. క్రెడిట్ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.


విశ్వసనీయ సైట్ల నుంచి మాత్రమే షాపింగ్ చేయండి
ఎల్లప్పుడూ విశ్వసనీయ సైట్ల నుండి షాపింగ్ చేయండి. ఈరోజుల్లో సైబర్ మోసగాళ్లు కూడా ఇలాంటి పేర్లతో ఉన్న సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు నిజమైన వెబ్‌సైట్ నుంచి షాపింగ్ చేస్తున్నారో లేదో ఎప్పుడూ వెరిఫై చేసుకోండి.


మీకు తెలియకపోతే రీసెర్చ్ చేయండి
మీరు మొదటి సారి ఏదైనా వెబ్‌సైట్ నుంచి షాపింగ్ చేస్తుంటే దాని గురించి రీసెర్చ్ చేయండి. ఆన్‌లైన్‌కి వెళ్లి దాని రివ్యూలను చదవండి. వెబ్‌సైట్‌కు చాలా నెగిటివ్ రివ్యూలు వచ్చినట్లయితే దాని నుంచి షాపింగ్ చేయకుండా ఉండండి. ఇలా చేయడం వల్ల సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా మీరు ఉండవచ్చు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను స్టార్ట్ చేయాలి
అనేక ఆన్‌లైన్ రిటైలర్లు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను అందిస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. పాస్‌వర్డ్ కాకుండా ఇది మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి ఇది మరొక మార్గాన్ని అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా మీ పాస్‌వర్డ్‌ను కనుగొన్నప్పటికీ, మెసేజ్ లేదా ఈమెయిల్‌లో వచ్చిన వెరిఫికేషన్ కోడ్ లేకుండా వారు మీ ఖాతాను యాక్సెస్ చేయలేరు.


వర్చువల్ లేదా డిస్పోజబుల్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించండి
అనేక ఫైనాన్షియల్ కంపెనీలు వర్చువల్ లేదా డిస్పోజబుల్ క్రెడిట్ కార్డుల సౌకర్యాన్ని అందిస్తాయి. ఇవి మీ క్రెడిట్ కార్డ్ ఖాతాకు లింక్ అయిన తాత్కాలిక కార్డ్ నంబర్‌లు, అయితే లావాదేవీ తర్వాత వాటి గడువు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏ మోసగాడూ మీ నిజమైన ఖాతాను యాక్సెస్ చేయలేరు.


మీ అకౌంట్‌పై నిఘా ఉంచండి
మీ ఖాతాపై నిఘా ఉంచండి. దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఏదైనా మీకు తెలియని లావాదేవీలు జరిగిందో లేదో తెలుసుకోవడంలో మీకు సాయం చేస్తుంది. మీరు అవసరమైన చర్యలు తీసుకోగలుగుతారు. అకౌంట్‌కు సంబంధించి ఏదైనా తెలియని యాక్టివిటీ గురించి మీకు తెలిసిన వెంటనే దాని గురించి బ్యాంకుకు తెలియజేయండి. ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వకపోతే మన క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?