ఇండియన్ ప్రీమియర్ లీగులో రిషభ్ పంత్‌కు రికార్డులు సృష్టించడం కొత్తేం కాదు! మెరుపు వేగంతో సిక్సర్లు బాదుతూ అతనిప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. క్షణాల్లో మ్యాచులను మలుపు తిప్పుతూ ఎందరి రికార్డులో బద్దలు కొట్టాడు. ఒకప్పటి డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును పంత్ తాజాగా బ్రేక్ చేశాడు.
Also Read: దిల్లీకి కోల్‌కతా చెక్..! 3 వికెట్ల తేడాతో విజయం.. ప్లేఆఫ్స్ వైపు పరుగులు!
వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్‌లో ఎక్కువగా దిల్లీ ఫ్రాంచైజీకే ఆడాడు. ఆ జట్టు తరఫున 85 ఇన్నింగ్సుల్లో 2382 పరుగులు చేశాడు. మంగళవారం వరకు దిల్లీ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా వీరూనే ఉండేవాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచులో 39 పరుగులు చేసిన పంత్ ఆ రికార్డును బద్దలు కొట్టేశాడు. కేవలం 75 ఇన్నింగ్సుల్లోనే 2390 పరుగులు సాధించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫ్రాంచైజీ తరఫున అతడు ఒక సెంచరీ, 14 అర్ధసెంచరీలు బాదేశాడు. అండర్-19కు ఆడుతున్నప్పటి నుంచే రిషభ్‌పంత్‌ను దిల్లీ అట్టిపెట్టుకుంది. అతడిని గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దింది.
Also Read: ఈ దీపావళికి బీసీసీఐకి కాసుల పంట! కొత్త జట్లు, మీడియా హక్కుల వేలంతో వేల కోట్ల ఆదాయం
దిల్లీ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం దిల్లీ తరఫున ఎక్కువే ఆడాడు. ఆ జట్టు తరఫున ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 82 ఇన్నింగ్సుల్లో అతడు 2291 పరుగులు చేశాడు. రిషభ్ పంత్‌తో పోటీ పడుతున్నాడు. సన్‌రైజర్స్ నుంచి దిల్లీకి వచ్చిన ఈ ఓపెనర్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఫ్రాంచైజీ తరఫున 58 ఇన్నింగ్సుల్లో 40.27 సగటుతో 1933 పరుగులు చేశాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం అతడిలాగే ఆడితే శ్రేయస్, రిషభ్, వీరూ రికార్డులను అతడు బద్దలు కొట్టడం గ్యారంటీ!
Also Read: రాజస్తాన్‌కు గెలుపు కంపల్సరీ.. కోహ్లీ సేనతో నేడే ఢీ!
దిల్లీ మూడేళ్లుగా వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటోంది. చరిత్రలో తొలిసారిగా గతేడాది ఫైనల్ ఆడింది. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కోచింగ్‌లో ఆ జట్టు పటిష్ఠంగా మారింది. అన్ని విభాగాలను సరిచేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, సహాయ సిబ్బంది, వ్యూహరచన.. ఇలా అన్నింట్లోనూ మెరుగైంది. గతేడాది వరకు శ్రేయస్ అయ్యర్ దిల్లీకి సారథ్యం వహించగా.. గాయంతో అతడు దూరమవ్వడంతో రిషభ్ పంత్‌ను నాయకుడిగా మారాడు. మ్యాచు మ్యాచుకూ సారథ్య మెలకువలను నేర్చుకుంటూ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి