సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చూస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తోందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అతడు కనీసం గూగ్లీలను ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో ఔటైతే ఫర్వాలేదని అలాంటిది స్పిన్‌లో ఔటవ్వడం బాధేస్తోందని వెల్లడించాడు.
Also Read: కోల్‌కతాకు దాదాపు ప్లేఆఫ్ బెర్తు.. ముంబై ఆశలు గల్లంతు..... రాజస్తాన్‌పై రైడర్స్ భారీ విజయం!
'మహీ అలా బ్యాటింగ్ చేయడం చూస్తుంటే బాధేస్తోంది. ఫాస్ట్ బౌలింగ్‌లో ఔటైతే అర్థం చేసుకోగలం. కానీ ధోనీ కనీసం గూగ్లీలను అర్థం చేసుకోలేక పోతున్నాడు. పదేపదే అలాగే జరుగుతోంది. ఇలా అవ్వడం ఇదే తొలిసారి కాదు. వరుణ్ చక్రవర్తి గూగ్లీలకూ అతడు ఔటవుతున్నాడు' అని పఠాన్ అన్నాడు.
Also Read: ఇసుక కాదు..! చెన్నైకి కేఎల్ తుపాను సెగ! 13 ఓవర్లకే లక్ష్యం ఛేదించేసిన కేఎల్ రాహుల్
ధోనీ బ్యాటింగ్‌లో ఇబ్బందులు పడుతున్నాడని పఠాన్ అంటున్నాడు. బాటమ్ హ్యాండ్‌ను ఉపయోగిస్తున్న తీరే అతడు ఔటవ్వడానికి కారణమని చెప్పాడు. 'ఇంతకు ముందూ ఇలాగే జరిగింది. బంతి స్టంప్స్‌పైకి వస్తున్నప్పుడు చేతులను వదులుగా పెట్టి ఆడటం లేదు. అక్కడే సమస్య ఉంది. ఆఫ్‌సైడ్ ఆవల బంతి పడ్డప్పుడూ అతడు ఇన్‌సైడ్ ఎడ్జ్ అవుతున్నాడు. బాటమ్ హ్యాండ్‌ను ఎక్కువగా ఆడుతున్నప్పుడే ఇలా జరుగుతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.
Also Read: సన్‌రైజర్స్ నవ్వింది! థ్రిల్లర్ మ్యాచులో కోహ్లీసేనను ఓడించింది
ఈ సీజన్లో ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. జట్టు మొత్తంగా బాగా ఆడినా రెండో అంచెలో ఆఖరి మ్యాచుల్లో ఓడిపోయింది. ధోనీ సైతం ఫామ్‌లో లేడు. పరుగులేమీ చేయడం లేదు. రవి బిష్ణోయ్, చక్రవర్తి వేస్తున్న గూగ్లీలకు ఔటవుతున్నాడు. బహుశా అతడికి 2022 సీజనే చివరి కావచ్చనే సూచనలు అందుతున్నాయి.
Also Read: ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?
Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి