KKR vs DC Live Updates: రాణా గెలిపించేశాడు! దిల్లీపై 3 వికెట్ల తేడాతో కేకేఆర్‌ విజయం

కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 41వ మ్యాచ్లో తలపడుతున్నాయి. ప్లేప్లేఆఫ్స్‌కు చేరుకున్న దిల్లీని ఓడించి టాప్‌-4లో నిలవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పట్టుదలతో ఉంది.

ABP Desam Last Updated: 28 Sep 2021 07:13 PM
రాణా గెలిపించేశాడు! దిల్లీపై 3 వికెట్ల తేడాతో కేకేఆర్‌ విజయం

దిల్లీపై కోల్‌కతా విజయం సాధించింది. ఆన్రిచ్ నార్జ్‌ వేసిన 18.2 బంతికి నితీశ్‌ రాణా (36*) బౌండరీ బాది గెలుపు బావుటా ఎగరేశాడు. 128 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 7 వికెట్లు నష్టపోయి మరో పది బంతులు ఉండగానే గెలిచింది.

18 ఓవర్లకు కోల్‌కతా 126-7

అవేశ్‌ ఖాన్‌ నాలుగు పరుగులిచ్చి టిమ్‌ సౌథీ (3)ని ఔట్‌ చేశాడు. రాణా (32)పై ఒత్తిడి పెరుగుతోంది. ఆ జట్టుకు 12 బంతుల్లో 2 పరుగులు కావాలి.

17 ఓవర్లకు కోల్‌కతా 122-6

నార్జ్‌ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి సునిల్‌ నరైన్‌ ఔటయ్యాడు. నితీశ్‌ రాణా (31),  టిమ్‌ సౌథీ (0) క్రీజులో ఉన్నారు. 


నితీశ్‌ రాణా (31; 22 బంతుల్లో)
సునిల్‌ నరైన్‌ (20; 6 బంతుల్లో )

16 ఓవర్లకు కోల్‌కతా 119-5

రబాడా ఈ ఓవర్లో ఏకంగా 21 పరుగులు ఇచ్చాడు. సునిల్‌ నరైన్‌ వరుసగా సిక్స్, బౌండరీ, సిక్స్‌ బాదేశాడు. రాణా అతడికి తోడుగా ఉన్నాడు. కోల్‌కతా విజయానికి 24 బంతుల్లో 9 పరుగులే అవసరం.


నితీశ్‌ రాణా (31; 22 బంతుల్లో)
సునిల్‌ నరైన్‌ (20; 6 బంతుల్లో )

15 ఓవర్లకు కోల్‌కతా 98-5


అవేశ్‌ ఖాన్‌ రెండు పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. రాణాపై భారం పెరిగింది. సునిల్‌ నరైన్‌ క్రీజులోకి వచ్చాడు.


నితీశ్‌ రాణా (30; 20 బంతుల్లో)
సునిల్‌ నరైన్‌ (1; 1 బంతుల్లో )

దినేశ్‌ కార్తీక్‌ ఔట్‌

అవేశ్‌ ఖాన్‌ వేసిన 14.4వ బంతికి దినేశ్‌ కార్తీక్‌ (12; 14 బంతుల్లో ) బౌల్డ్‌ అయ్యాడు.

జోరు పెంచిన కేకేఆర్‌: 14 ఓవర్లకు కోల్‌కతా 96-4

లలిత్‌ యాదవ్‌ దిల్లీ కొంప ముంచాడు. ఎక్కువ వేగంగా స్పిన్‌ చేశాడు. 20 పరుగులు ఇచ్చాడు. నితీశ్‌ రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు. కార్తీక్‌ ఒక బౌండరీ కొట్టాడు.


నితీశ్‌ రాణా (29; 19 బంతుల్లో)
దినేశ్‌ కార్తీక్‌ (12; 10 బంతుల్లో )

13 ఓవర్లకు కోల్‌కతా 76-4

ఈ ఓవర్లో రబాడా ఏడు పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతి దినేశ్‌ కార్తీక్‌ బ్యాటుకు అంచుకు తగిలి థర్డ్‌మ్యాన్‌ దిశగా బౌండరీ లభించింది. రాణా అతడికి తోడుగా ఉన్నాడు.


నితీశ్‌ రాణా (14; 15 బంతుల్లో)
దినేశ్‌ కార్తీక్‌ (7; 8 బంతుల్లో )

12 ఓవర్లకు కోల్‌కతా 69-4

అశ్విన్‌ కేవలం రెండు పరుగులే ఇచ్చి మోర్గాన్‌ను ఔట్ చేశాడు. దినేశ్ కార్తీక్‌ క్రీజులోకి వచ్చాడు. నితీశ్‌ రాణా ఆచితూచి ఆడుతున్నాడు.


నితీశ్‌ రాణా (13; 14 బంతుల్లో)
దినేశ్‌ కార్తీక్‌ (1; 3 బంతుల్లో )

మోర్గాన్‌ను బుట్టలో వేసిన యాష్‌

అశ్విన్‌ వేసిన 11.2వ బంతికి మోర్గాన్‌ (0) ఔటయ్యాడు. స్లిప్‌లో లలిత్‌ యాదవ్‌కు చిక్కాడు.

రబాడా రాక్స్‌.. గిల్‌ ఔట్‌: 11 ఓవర్లకు కోల్‌కతా 67-3

కాగిసో రబాడా అద్భుతం చేశాడు. ఈ ఓవర్లో పరుగులేమీ ఇవ్వకుండా శుభ్‌మన్‌ గిల్‌ (30; 33  బంతుల్లో 1x4, 2x6)ను ఔట్‌ చేశాడు. వరుసగా ఐదు బంతుల్ని బీట్‌ చేసిన గిల్‌ ఆఖరి బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి శ్రేయస్‌ అయ్యర్‌కు చిక్కాడు. రాణా మరో ఎండ్‌లో ఉన్నాడు.


నితీశ్‌ రాణా (12; 13 బంతుల్లో)

10 ఓవర్లకు కోల్‌కతా 67-2

లలిత్‌ యాదవ్‌ ఐదు పరుగులు ఇచ్చాడు. రాణా, గిల్‌ నిలకడగా ఆడుతున్నారు.


నితీశ్‌ రాణా (12; 13 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (30; 27  బంతుల్లో)

9 ఓవర్లకు కోల్‌కతా 62-2

అశ్విన్ ఈ ఓవర్లో తొలి ఐదు బంతులను బాగా వేశాడు. అయితే ఆరో బంతిని రాణా బౌండరీకి పంపించాడు. గిల్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.


నితీశ్‌ రాణా (8; 8 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (29; 26  బంతుల్లో)

8 ఓవర్లకు కోల్‌కతా 54-2

అక్షర్‌ కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. రాణా, గిల్‌ ఆచితూచి ఆడాడు.


నితీశ్‌ రాణా (2; 4 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (27; 24  బంతుల్లో)

7 ఓవర్లకు కోల్‌కతా 52-2

అశ్విన్‌ ఎనిమిది పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని మిడ్‌వికెట్‌ మీదుగా శుభ్‌మన్‌ గిల్‌ భారీ సిక్సర్‌ బాదేశాడు. అయితే బౌండరీ మీద స్టీవ్‌ స్మిత్‌ ఆ బంతిని అందుకొనేందుకు విఫలయత్నం చేశాడు. రాణా నిలకడగా ఆడుతున్నాడు.


నితీశ్‌ రాణా (1; 2 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (26; 20  బంతుల్లో)

6 ఓవర్లకు కోల్‌కతా 44-2

అవేశ్‌ ఖాన్‌ ఎనిమిది పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. నితీశ్‌ రాణా క్రీజులోకి వచ్చాడు. శుభ్‌మన్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.


నితీశ్‌ రాణా (0; 1 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (19; 15  బంతుల్లో)

రాహుల్‌ త్రిపాఠి ఔట్‌

అవేశ్‌ ఖాన్‌ వేసిన 5.5వ బంతికి రాహుల్‌ త్రిపాఠి (9: 5 balls 1x6)  ఔటయ్యాడు. స్టీవ్‌స్మిత్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

5 ఓవర్లకు కోల్‌కతా 36-1


లలిత్‌ యాదవ్‌ పది పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. రాహుల్‌ త్రిపాఠి రాగానే సిక్సర్‌ బాదేశాడు. గిల్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.


రాహుల్‌ త్రిపాఠి (8; 3 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (13; 12  బంతుల్లో)

వెంకటేశ్‌ బౌల్డ్‌

లలిత్‌ యాదవ్‌ వేసిన 4.3వ బంతికి వెంకటేశ్‌ అయ్యర్‌ (14: 15 balls 2x4) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

4 ఓవర్లకు కోల్‌కతా 26-0

అక్షర్‌ నాలుగు పరుగులు ఇచ్చాడు. వెంకటేశ్‌, గిల్‌ ఆచితూచి ఆడారు.


వెంకటేశ్‌ అయ్యర్‌ (13; 13 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (12; 11  బంతుల్లో)

3 ఓవర్లకు కోల్‌కతా 22-0

అశ్విన్ బౌలింగ్‌కు దిగాడు. ఆరు పరుగులు ఇచ్చాడు. వెంకటేశ్‌ షాట్లకు ప్రయత్నించాడు. గిల్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


వెంకటేశ్‌ అయ్యర్‌ (11; 10 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (10; 8  బంతుల్లో)

2 ఓవర్లకు కోల్‌కతా 16-0; లక్ష్యం 128

 


అక్షర్‌ పటేల్‌ మరో ఎండ్‌ నుంచి బౌలింగ్‌ దాడి ఆరంభించాడు. ఏడు పరుగులు ఇచ్చాడు. రెండో బంతికి శుభ్‌మన్‌ గిల్‌ కళ్లుచెదిరే సిక్సర్‌ బాదేశాడు. వెంకటేశ్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


వెంకటేశ్‌ అయ్యర్‌ (8; 6 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (8; 6  బంతుల్లో)

1 ఓవర్‌కు కోల్‌కతా 9-0; లక్ష్యం 128

ఆన్రిచ్‌ నార్జ్‌ బౌలింగ్‌ దాడి ఆరంభించాడు. తొమ్మిది పరుగులు ఇచ్చాడు. పేస్‌కు అనుకూలించని పిచ్‌పై అతడు ఎక్కువ వేగంతో బంతులు వేయడంతో స్కోరు వచ్చింది. వెంకటేశ్‌ అయ్యర్‌ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. శుభ్‌మన్‌ గిల్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


వెంకటేశ్‌ అయ్యర్‌ (8; 5 బంతుల్లో)
శుభ్‌మన్‌ గిల్‌ (1; 1  బంతుల్లో)

20 ఓవర్లకు దిల్లీ 127-9

టిమ్‌ సౌథీ ఈ ఓవర్‌ను అద్భుతంగా విసిరాడు. మొత్తంగా మూడు వికెట్లు లభించాయి. యాష్‌ క్యాచ్‌ ఔట్‌ అవ్వగా రిషభ్‌ పంత్‌, అవేశ్‌ ఖాన్‌ (5) రనౌట్‌ అయ్యారు. కాగిసో రబాడా (0) అజేయంగా నిలిచాడు.

రిషభ్‌ పంత్‌ ఔట్‌

సౌథీ వేసిన 19.2బంతికి వేగంగా రెండో పరుగుకు ప్రయత్నించిన రిషభ్ పంత్‌  (39; 36 బంతుల్లో) రనౌట్‌ అయ్యాడు.

19 ఓవర్లకు దిల్లీ 120-6


వెంకటేశ్‌ అయ్యర్‌ పది పరుగులు ఇచ్చాడు. బౌలింగ్‌లో మంచి వైవిధ్యం చూపించాడు. పంత్‌ ఓ బౌండరీ కొట్టాడు. యాష్‌ అతడికి అండగా నిలిచాడు.
 
రవిచంద్రన్‌ అశ్విన్‌ (9; 7 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (38; 35 బంతుల్లో)

18 ఓవర్లకు దిల్లీ 110-6

టిమ్‌ సౌథీ ఎనిమిది పరుగులు ఇచ్చాడు. ఎట్టకేలకు రిషభ్ పంత్‌ ఒక బౌండరీ బాదాడు. యాష్ అతడికి తోడుగా ఉన్నాడు.
 
రవిచంద్రన్‌ అశ్విన్‌ (8; 6 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (29; 30 బంతుల్లో)

17 ఓవర్లకు దిల్లీ 102-6

చక్రవర్తి నాలుగు పరుగులే ఇచ్చాడు. దిల్లీ ఆటగాళ్లు బౌండరీలు కొట్టలేకపోతున్నారు. పంత్‌ ఇప్పటి వరకు కొట్టింది ఒక్కటే బౌండరీ. అశ్విన్‌ అతడికి తోడుగా ఉన్నాడు.
 
రవిచంద్రన్‌ అశ్విన్‌ (6; 4 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (23; 26 బంతుల్లో)

16 ఓవర్లకు దిల్లీ 98-6

 


వెంకటేశ్ అయ్యర్‌ తన రెండో ఓవర్లోనూ అద్భుతం చేశాడు. వికెట్‌ తీసి కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. ఆఖరి బంతిని అశ్విన్‌ బౌండరీకి తరలించాడు. పంత్‌ దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది.
 
రవిచంద్రన్‌ అశ్విన్‌ (5; 2 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (21; 22 బంతుల్లో)

వావ్‌.. వెంకీకి మరో వికెట్‌..అక్షర్‌ ఔట్‌

వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన 15.3వ బంతికి అక్షర్‌ పటేల్‌ (0) డకౌట్‌ అయ్యాడు. 

15 ఓవర్లకు దిల్లీ 89-5

నరైన్‌ ఈ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి లలిత్‌ యాదవ్‌ను ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌ క్రీజులోకి వచ్చాడు. పంత్‌ ఆచితూచి ఆడుతున్నాడు.


అక్షర్‌ పటేల్‌ (0; 3 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (19; 20 బంతుల్లో)

లలిత్‌ యాదవ్‌ ఔట్‌

నరైన్‌ వేసిన 14.3వ బంతికి లలిత్‌ యాదవ్‌ (0) ఎల్బీ అయ్యాడు. దీంతో దిల్లీ ఐదు వికెట్లు నష్టపోయి 89 వదద్ ఉంది.

హెట్‌మైయిర్‌కు వెంకీ షాక్‌! 14 ఓవర్లకు దిల్లీ 88-3

వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఓవర్లో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కీలకమైన హెట్‌మైయిర్‌ (4)ను ఔట్‌ చేశాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో అతడు బౌండరీ లైన్‌ వద్ద సౌథీకి చిక్కాడు. లలిత్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. పంత్‌ సమయోచితంగా ఆడుతున్నాడు.


లలిత్‌ యాదవ్‌ (0; 1 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (18; 19 బంతుల్లో)

13 ఓవర్లకు దిల్లీ 81-3

ఫెర్గూసన్‌ కీలక సమయంలో వికెట్‌ తీశాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. హెట్‌మైయిర్‌ క్రీజులోకి వచ్చాడు. రిషభ్ పంత్‌ ఇంకా గేరు మార్చలేదు.


హెట్‌మైయిర్‌ (3; 3 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (12; 16 బంతుల్లో)

ఫెర్గూసన్‌ కేక.. స్మిత్‌ ఔట్‌

ఫెర్గూసన్‌ వేసిన 12.2 బంతికి స్టీవ్‌ స్మిత్‌  (39; 34 బంతుల్లో) బౌల్డ్‌ అయ్యాడు. 

తగ్గిన వేగం: 12 ఓవర్లకు దిల్లీ 77-2

వెంకటేశ్‌ అయ్యర్‌ బౌలింగ్‌కు వచ్చాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. స్మిత్‌, పంత్‌ ఆచితూచి ఆడుతున్నారు.


స్టీవ్‌ స్మిత్‌ (39; 32 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (11; 15 బంతుల్లో)

11 ఓవర్లకు దిల్లీ 73-2

నరైన్‌ 9 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని స్మిత్‌ బౌండరీకి పంపించాడు. రిషభ్ పంత్‌ అతడికి తోడుగా ఉన్నాడు. 


స్టీవ్‌ స్మిత్‌ (37; 29 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (10; 12 బంతుల్లో)

పుంజుకున్న స్మిత్‌; 10 ఓవర్లకు దిల్లీ 64-2

వరుణ్‌ చక్రవర్తి 12 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో స్టీవ్‌స్మిత్‌ తెలివిగా ఆడాడు. గ్యాపులు రాబట్టి వరుసగా రెండు బౌండరీలు బాదాడు. పంత్‌ వేగంగా పరుగులు తీశాడు.


స్టీవ్‌ స్మిత్‌ (31; 26 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (7; 9 బంతుల్లో)

9 ఓవర్లకు దిల్లీ 52-2

నరైన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ ఓవర్లో ఐదు పరుగులే ఇచ్చాడు. స్మిత్‌  షాట్లు కొట్టాలని ప్రయత్నించినా బంతిని అంచనా వేయలేకపోయాడు. పంత్‌ ఆచితూచి ఆడాడు.


స్టీవ్‌ స్మిత్‌ (22; 22 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (4; 7 బంతుల్లో)

8 ఓవర్లకు దిల్లీ 47-2

వరుణ్‌ చక్రవర్తి కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. స్మిత్‌, పంత్‌ ఆచితూచి ఆడారు.


స్టీవ్‌ స్మిత్‌ (18; 18 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (3; 5 బంతుల్లో)

శ్రేయస్‌కు నరైన్‌ షాక్‌! 7 ఓవర్లకు దిల్లీ 42-2  

సునిల్‌ నరైన్‌ ఒక వికెట్‌ తీసి కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. రిషభ్ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. స్టీవ్‌స్మిత్‌ నిలకడగా ఆడుతున్నాడు.


స్టీవ్‌ స్మిత్‌ (15; 14 బంతుల్లో)
రిషభ్‌ పంత్‌ (1; 3 బంతుల్లో)

శ్రేయస్‌కు షాకిచ్చిన నరైన్‌

సునిల్‌ నరైన్‌ వేసిన 6.2వ బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ (1: 5 balls) ఔటయ్యాడు. టర్న్‌ అవుతున్న బంతిని ఊహించలేక క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

6 ఓవర్లకు దిల్లీ 39-1

మిస్టరీ బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి బంతి అందుకున్నాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. స్మిత్‌ నిలకడగా ఆడుతున్నాడు.


స్టీవ్‌ స్మిత్‌ (13; 12 బంతుల్లో)
శ్రేయస్‌ అయ్యర్‌ (1; 4 బంతుల్లో)

ప్చ్‌.. ధావన్‌ ఔట్‌! 5 ఓవర్లకు దిల్లీ 35-1

ఫెర్గూసన్‌ కేకేఆర్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. శిఖర్‌ ధావన్‌ను ఔట్‌ చేశాడు. ఆఖరి బంతిని కవర్స్‌వైపు ఆడే క్రమంలో నేరుగా వెంకటేశ్‌ అయ్యర్‌కు  క్యాచ్‌ ఇచ్చాడు. స్టీవ్‌ స్మిత్‌ రెండో బంతిని అద్భుతమైన బౌండరీగా మలిచాడు.


స్టీవ్‌ స్మిత్‌ (11; 10 బంతుల్లో)
శిఖర్‌ ధావన్‌ (24; 20 బంతుల్లో)

దూకుడుగా ధావన్‌: 4 ఓవర్లకు దిల్లీ 29-0

టిమ్‌ సౌథీ అద్భుతంగా వేశాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. నాలుగో బంతిరి శిఖర్‌ ధావన్‌ బౌండరీకి పంపించాడు. అయితే ఐదో బంతిని అడ్డంగా ఆడే క్రమంలో బంతి ప్యాడ్లకు తాకింది. కోల్‌కతా సమీక్ష కోరగా అంపైర్‌ కాల్‌ వచ్చింది. అతడు బతికి పోయాడు. స్మిత్‌ నిలకడగా ఆడుతున్నాడు.


స్టీవ్‌ స్మిత్‌ (6; 8 బంతుల్లో)
శిఖర్‌ ధావన్‌ (23; 16 బంతుల్లో)

3 ఓవర్లకు దిల్లీ 22-0  

సందీప్‌ వారియర్‌ తన రెండో ఓవర్లో పది పరుగులు ఇచ్చాడు. రెండు, మూడో బంతుల్ని ధావన్‌ వరుసగా బౌండరీకి పంపించాడు. స్మిత్‌ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా బంతులు బీట్‌ అయ్యాయి.


స్టీవ్‌ స్మిత్‌ (5; 7 బంతుల్లో)
శిఖర్‌ ధావన్‌ (17; 12 బంతుల్లో)

2 ఓవర్లకు దిల్లీ 12-0  

మరో ఎండ్ నుంచి టిమ్‌ సౌథీ బౌలింగ్‌ ఆరంభించాడు. ఎక్కువ వేగంగా బంతులు విసరలేదు. ఏడు పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని ధావన్‌ బౌండరీ బాదాడు. స్మిత్‌ ఆచితూచి ఆడుతున్నాడు.


స్టీవ్‌ స్మిత్‌ (4; 4 బంతుల్లో)
శిఖర్‌ ధావన్‌ (8; 8 బంతుల్లో)

1 ఓవర్‌కు దిల్లీ 5-0  

సందీప్‌ వారియర్‌ బౌలింగ్‌ దాడి ఆరంభించాడు. శిఖర్‌ ధావన్‌ ఆచితూచి ఆడాడు. ఫుల్‌టాస్‌గా వేసిన ఐదో బంతిని బౌండరీకి పంపించాడు. మరో ఎండ్‌లో స్మిత్‌ ఉన్నాడు.


స్టీవ్‌ స్మిత్‌ (1; 1 బంతుల్లో)
శిఖర్‌ ధావన్‌ (4; 5 బంతుల్లో)

పృథ్వీషా దూరం

దిల్లీ జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. అతడికి గాయం కావడంతో విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో స్టీవ్‌స్మిత్‌ను ఎంచుకున్నారు. 

బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచులో కోల్‌కతా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

Background

యూఏఈలో ఇప్పటివరకు కోల్‌కతా మంచి ప్రదర్శనే చేసింది. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో చతికిలపడటంలో కోల్‌కతా కొద్ది తేడాలో ఓటమి పాలైంది. టాప్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి మంచి ఫాంలో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్ పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు కూడా తీయగలుగుతున్నారు. ఆల్ రౌండర్ రసెల్ కూడా జట్టులో కీలకమైన ఆటగాడు.


ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఢిల్లీ బరిలోకి దిగింది. మార్కస్ స్టాయినిస్ స్థానంలో లలిత్ యాదవ్ బరిలోకి దిగాడు. ఢిల్లీ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో తిరుగు లేకుండా దూసుకుపోతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి తమ టాప్ ప్లేస్ అందుకోవాలనేది ఢిల్లీ లక్ష్యం.


తుది జట్లు(అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీష్ రాణా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, లోకి ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ


ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, ఆన్రిచ్ నోర్జే, అవేష్ ఖాన్

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.