TG Group 1 Results | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల ఫలితాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ ను, మెయిన్స్ పేపర్ల ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీజీపీఎస్సీ ఇదివరకే ప్రిమిల్స్ నిర్వహించాక మెయిన్స్ కు జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసి మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ నెలలో నిర్వహించింది.

పోస్టింగ్స్ వస్తాయనుకుంటే ఫలితాలు రద్దు

మార్చి 10న మెరిట్ లిస్ట్ నిర్వహించింది, తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ సైతం నిర్వహించి త్వరలో వారికి పోస్టులు కేటాయించాల్సి ఉన్న తరుణంలో ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. త్వరలోనే తమకు పోస్టింగ్ వస్తుంది అనుకున్న అభ్యర్థులకు హైకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దాంతో తెలంగాణ వచ్చి 11 ఏళ్లు గడిచినా ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు.

గ్రూప్ 1 ఫలితాలు మరోసారి రద్దు

తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో రెండు పర్యాయాలు గ్రూప్ 1 నిర్వహించిన ఫలితాలు రద్దు చేసింది హైకోర్టు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా పోస్టులు చేర్చుతూ గ్రూప్ 1 రీనోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్ నిర్వహించింది, తరువాత మెయిన్స్ నిర్వహించే సమయంలో జనరల్ ర్యాకింగ్స్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే మెయిన్స్ దగ్గర పడ్డాయని ఆ సమయంలో పిటిషన్లు కొట్టివేసింది. కానీ మెయిన్స్ ఫలితాలు వచ్చాక, సర్టిఫికేషన్ సైతం పూర్తి చేశారు. అయితే పేపర్ల మూల్యాంఖనంలో తప్పిదాలు జరిగాయని, మెరిట్ లిస్టులో తప్పిదాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లు విచారించిన హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది.

మెయిన్స్ పేపర్లు సరిగ్గా వాల్యుయేషన్ జరగలేదని దాఖలైన పిటిషన్లను హైకోర్టు సమర్థించింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేయడం వీలుకాకపోతే మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్ సాధ్యం కాని పక్షంలో దాదాపు 8 నెలల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.  

 

గ్రూప్-1 పోస్టులు

ఖాళీల సంఖ్య: 563

క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్) 05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563